పాక్‌లో జాక్ మా.. రహస్య పర్యటన..?

ప్రముఖ బిలియనీర్‌, ఈ కామర్స్‌ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా తాజాగా పాకిస్థాన్ లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని పాక్ ఇంగ్లీష్ మీడియా సంస్థ ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. జాక్ మా పర్యటన గురించి బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ మాజీ చైర్మన్ మహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ చెప్పినట్లు ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. జూన్ 29న జాక్ మా పాకిస్థాన్ లాహోర్ కు చేరుకున్నట్లు తెలిపింది. 23 గంటల పాటు ఆయన అక్కడే బస చేసినట్లు పేర్కొంది.

New Update
పాక్‌లో జాక్ మా.. రహస్య పర్యటన..?

international-news-jack-mas-sudden-pakistan-trip-sparks-a-buzz-report-viralప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఏవియేషన్ కు చెందిన ప్రైవేట్ జెట్ పీవీ-సీఎమ్ఏలో పాక్ కు చేరుకున్నట్లు చెప్పారు. అనంతరం 30వ తేదీన మా తిరిగి వెళ్లిపోయినట్లు సంస్థ తెలిపింది. జాక్ మాతో పాటు మరో ఏడుగురు వ్యాపార వేత్తలు కూడా ఈ పర్యటనలో పాలు పంచుకున్నారు. వారిలో ఐదుగురు చైనాకు చెందిన అధికారులు కాగా, ఒకరు డెన్మార్క్ కు చెందిన వారు, మరొకరు అమెరికా దేశస్తుడు. వీరంతా హాంకాంగ్ లోని కమర్షియల్ ఏవియేషన్ సెక్టార్ నుంచి చార్టెడ్ విమానంలో నేపాల్ కు వచ్చి.. అక్కడి నుంచి పాకిస్థాన్ చేరుకున్నారు.

కాగా, జాక్ మా పాకిస్థాన్ లో 23 గంటలపాటు బస చేసినప్పటికీ అధికారులతో చర్చలు జరపలేదు. అదే సమయంలో మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. అతను ఓ ప్రైవేట్ ప్రాంతంలో బస చేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనపై గోప్యత పాటిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో దాని సానుకూల ఫలితాలు పాక్ లో కనిపిస్తాయని భావిస్తున్నారు. మరోవైపు జాక్ మా తన బృందంతో కలిసి పాకిస్థాన్ లో పర్యటించడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ లో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని అహ్సన్ తెలిపినట్లు ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.

అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020 చివరిలో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ చైనా రెగ్యులేటరీ సిస్టంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత చైనా అధికారులు జాక్‌మాకు చెందిన కంపెనీలపై వరుసగా దాడులు చేశాయి. ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ప్రభుత్వ ఆగ్రహంతో అలీబాబా, యాంట్‌ గ్రూప్‌ తీవ్రంగా నష్టపోయాయి. అద‌న‌పు నిధుల సేక‌ర‌ణ ల‌క్ష్యంగా యాంట్ గ్రూప్ ప్ర‌తిపాదించిన ఐపీవోనూ చైనా నియంత్ర‌ణ సంస్థ‌లు అడ్డుకున్నాయి. ఈ ఐపీవో ద్వారా 37 బిలియ‌న్ డాల‌ర్ల నిధులు స‌మీక‌రించాల‌ని జాక్ మా ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు