అంతరిక్ష శబ్ధాలను కనుగొన్న సైంటిస్టులు.. కీలక పాత్రలో భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు.... అంతరిక్షంలో వినిపిస్తున్న శబ్ధాలకు చెందిన బ్యాక్‌గ్రౌండ్ స్వరాలను గుర్తుపట్టినట్లు ఖగోళ శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు గురువారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. దీంట్లో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కూడా కీలక పాత్ర పోషించారని వెల్లడిస్తూ రాసుకొచ్చారు. భారత్‌లోని పుణెలో ఉన్న రేడియో టెలిస్కోప్‌కు ఆ ధ్వని తరంగాలు చిక్కినట్లు ఖగోళ శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. By Shareef Pasha 29 Jun 2023 in ఇంటర్నేషనల్ Scrolling New Update షేర్ చేయండి అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తున్న శబ్ధాలకు చెందిన గుట్టును ఖగోళ శాస్త్రవేత్తలు విప్పారు. గురుత్వాకర్షణ తరంగాల నుంచి వస్తున్న ఆ ధ్వనులకు చెందిన కీలక ప్రటకన చేశారు. అంతరిక్షంలో వినిపిస్తున్న శబ్ధాలకు చెందిన బ్యాక్‌గ్రౌండ్ స్వరాలను గుర్తుపట్టినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తులు గురువారం ప్రకటన చేశారు. దీంట్లో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కూడా కీలక పాత్ర పోషించారు. పుణెలో ఉన్న రేడియో టెలిస్కోప్‌కు ఆ ధ్వని తరంగాలు చిక్కినట్లు నిర్ధారించారు. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ డేటాను సేకరిస్తున్నట్లు ఆస్ట్రోఫిజిస్టులు వెల్లడించారు. నక్షత్రాలు, పాలపుంతలు.. దాటుతూ సుదూర తీరాల నుంచి ఆ హమ్మింగ్ వస్తున్నట్లు తెలిపారు. గెయింట్ మెట్రీవేవ్ రేడియో టెలిస్కోప్ తో పాటు బెంగుళూరులోని రామన్ రీసర్చ్ ఇన్స్‌టిట్యూట్ పరిశోధకులు కాస్మిక్ ధ్వని గుర్తింపులో కీలక పాత్ర పోషించారు. నార్త్ అమెరికన్ నానోహెట్జ్ అబ్జర్వేటరీ ఫర్ గ్రావిటేషన్ వేవ్స్ బృందం ఆధ్వర్యంలో ఈ అధ్యయనం సాగింది. ఇండియాతో పాటు కెనడా, యూరోప్, చైనా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ స్టడీలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లు శ్రమించి వాళ్లు డేటాను సేకరించారు. పల్సర్స్ అనే మండిన నక్షత్రాలను శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఆ నక్షత్రాల నుంచి గురుత్వాకర్షణ తరంగాలు వస్తున్నట్లు గుర్తించారు. ఆ తరంగాలు చాలా శక్తివంతంగా ఉన్నట్లు నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు గడిచిన 18 ఏళ్లలో 115 పల్సర్స్ గురించి స్టడీ చేసినట్లు పేర్కొన్నారు. ఆ పల్సర్స్ మిలియన్ల రెట్లు శక్తివంతమైన గురుత్వాకర్షణ శబ్ధాలను సృష్టిస్తున్నట్లు తేల్చారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి