నరసాపురంలో తీవ్ర ఉద్రిక్తత .. భారీగా మోహరించిన పోలీసులు మురుగుకాల్వల నిర్మాణం కోసం దుకాణాలు కూల్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో శనివారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నరసాపురంలో పురపాలకశాఖ ఆధ్వర్యంలో స్టీమర్ రోడ్డులో డ్రెయిన్ల పునర్నిర్మాణ పనులు చేపట్టారు. దీంట్లో భాగంగా పురపాలకాధికారులు ఇటీవల ఆక్రమణలు తొలిగింపు చేపట్టారు. By Vijaya Nimma 30 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి దుకాణాలు కూల్చడమే లక్ష్యం ఈ రహదారికి సెంటరు ప్రాంతంలో పురపాలక శాఖాధికారులు ముందు వేసిన మార్కింగ్‌ను దాటి రెండోపర్యాయం దుకాణాలు కూల్చడమే లక్ష్యంగా మార్కింగ్.. వేసారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, పలువురు దుకాణ యజమానులు గతకొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మార్కింగ్ ఇచ్చిన వరకు నిర్మాణాలు తొలిగింపు.. ఇటీవల ఆ ప్రాంతాన్ని పురపాలక కమిషనర్ కె వెంకటేశ్వరరావు సందర్శించి మాధవనాయుడుతో మాట్లాడారు. ప్రజోపయోగం నిమిత్తం చేపట్టిన నిర్మాణపనులకు సహకరించాలని కోరారు. పురపాలకశాఖ సిబ్బంది మార్కింగ్ వేసిన ప్రాంతం దుకాణ యజమానులు సొంతమని తమతోపాటు వారికి కూడా ఇబ్బంది లేకుండా చూడాలని మాధవనాయుడు సూచించారు. నిమురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వివాదం ఒక్కసారిగా రాజుకుంది. పురపాలక అధికారులు మార్కింగ్ ఇచ్చిన వరకూ నిర్మాణాన్ని జేసీబీతో తొలిగించారు. అధిక సంఖ్యలో పోలీసులు ఘన్షణ ఎక్కువగా కావటంతో భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. జిల్లాలోని పలుప్రాంతాల నుంచి ఉదయం నుంచి పోలీసు సిబ్బంది ఎవరికి వారే వాహనాలపై తరలివచ్చారు. సాధారణంగా చెట్లు, నిర్మాణాలు తొలిగించడాన్ని ఈ ప్రాంతంలో అధికారులు శని, ఆదివారాల్లో చేస్తున్నారు. అధిక సంఖ్యలో పోలీసుల రాకతో ఏ ప్రాంతంలో ఏం తొలిగిస్తారోనని ఉదయం నుంచి పలువురు ప్రజలు చర్చించుకున్నారు. జూలై 29న (శనివారం) పురపాలక పట్టణ ప్రణాళికా విభాగ అధికారులు ఆయా దుకాణాల వద్ద మెట్ల వరకూ నిర్మాణాలను తొలిగించారు. దీంతో అందరూ సమస్య పరిష్కారమైందని ఊపిరిపీల్చుకున్నారు. సాయంత్రానికి రెండో పర్యాయం మార్కింగ్ ఇచ్చిన వరకూ తొలిగిస్తారనే సమాచారం అందడంతో మాధవనాయుడుకు మద్దతుగా అనుచరులు, అభిమానులు తరలివచ్చారు. వర్గీయుల మధ్య తీవ్రవాగ్వాదం కోర్టు స్టే ఉన్నా.. పురపాలకశాఖ కమిషనర్, పట్టణ ప్రణాళిక, డీఎస్పీ కె రవి మనోహరచారి, సీఐలు శ్రీనివాసయాదవ్, సురేష్‌బాబు, పలువురు ఎస్సైలు, సిబ్బంది భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. తమకు కోర్టు స్టే మంజూరు చేసిందని.. దీన్ని మీరు ఎలా దిక్కరిస్తారని మాధవనాయుడు అధికారులను ప్రశ్నించారు. దీంతో తమకు సంబంధం లేదని బదులివ్వడంతో వివాదం చోటుచేసుకుంది. అధికారులు, మాధవనాయుడు, ఆయన వర్గీయుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. చివరకు మాధవనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా లాక్కెళ్లారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. కొంత సేపు తోపులాట జరిగింది. మాధవనాయుడు అనుచరుడి కాలు విరిగింది. ఇంకా కొంత మందికి గాయాలయాయ్యాయి. మాధవనాయుడును పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల అదుపులో మాధవనాయుడు ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. తోపులాట జరిగింది. మాధవనాయుడు అనుచరుడు రెడ్డిం శ్రీను కాలువిరిగింది. పలువురికి గాయాలయ్యాయి. మాధవనాయుడును పట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అధికారులు మార్కింగ్ ఇచ్చిన వరకూ నిర్మాణాన్ని జేసీబీతో తొలగించారు. ముందస్తు చర్యల్లో భాగంగా మాధవనాయుడిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. అర్ధరాత్రి తర్వాత వదిలేస్తామని వెల్లడించారు. ఘటన ఘటనపై అప్పటికే పోలీసులు భారీగా మోహరించారు మాజీ ఎమ్మెల్యే చొక్కా సైతం చినిగిపోయింది ఘర్షణలో ఎమ్మెల్యే అని చేరుడి కాలు విరిగిపోయింది చివరకు మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు అని పోలీసులు అరెస్టు చేశారు తీవ్ర ఉద్విక్త పరిస్థితుల మధ్య ఈ అక్రమ తొలగింపులు కొనసాగుతున్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి