చైనా మోడల్ అనుసరించండి: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇటీవలే ఉద్యోగుల పని గంటలపై వివాదాస్పద కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జీడీపీలో మనకన్నా ఎన్నో రెట్ల ముందున్న చైనా విధానాలను పరిశీలించాలని, ఉచిత పథకాలు పొందిన వారు ఎంతోకొంత తిరిగివ్వాలని అన్నారు. By Naren Kumar 30 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Infosys Narayana Murthy: వారానికి 72 గంటలు పనిచేయాలంటూ ఇటీవల వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. భారతదేశ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల లోపే ఉండగా చైనా జీడీపీ 19 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, ఆ దేశం అవలంభిస్తున్న నమూనాను అధ్యయనం చేసి మన దేశంలో కూడా అమలు చేయాలని సూచించారు. బెంగళూరులో జరిగిన ఒక సాంకేతిక సదస్సులో పాల్గొన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఈ వ్యాఖ్యలు చేశారు. మనదేశంలోని దాదాపు అన్ని సవాళ్లనూ చైనా కూడా ఎదుర్కొంటోందని, అయినప్పటికీ జీడీపీలో భారత్ కన్నా చాలా రెట్లు ముందుందని నారాయణమూర్తి అన్నారు. ఇది కూడా చదవండి: బర్రెలక్క ఓట్ల లెక్క తేల్చేసిన సర్వే.. టెన్సన్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న ఉచిత పథకాలు, తాయిలాలపై కూడా నారాయణ మూర్తి అసంతృప్తి వ్యక్తపరిచారు. అయితే, దానిపై వివరణగా కొనసాగింపునిస్తూ.. తాను ఉచితాలకు వ్యతిరేకం కాదని, ఉచితాలు పొందిన వారు దానికి బదులు సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అన్నారు. పేద కుటుంబం నుంచే తాను కూడా పైకి వచ్చానని; ఉచితాలు, రాయితీల లబ్ధిదారులు సామాజిక బాధ్యత నిర్వర్తించాలని నారాయణ మూర్తి సూచించారు. #infosys-narayana-murthy #freebies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి