Indonesia: ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి!

ఇండోనేషియాలోని సులవేసి దీవిలోని బంగారు గని తవ్వకాల్లో కొండ చరియలు విరిగిపడి 12 మృతి చెందారు.ఈ తవ్వకాల్లో 30 మంది కార్మికులు పాల్గొన్నగా 12 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమైయాయి. మిగిలిన వారి కోసం సహాయ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

New Update
Indonesia: ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి!

Landslide: ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని కొరొండలోలో బంగారు గని పనులు కొద్ది రోజులుగా జరుగుతున్నాయి.నిన్న రాత్రి 30 మందికి పైగా కార్మికులు గనిలో తవ్వకాలను ప్రారంభించారు.ఆ సమయంలో తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి.

దీంతో సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని 12 మంది మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మిగలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: మీరు ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే ఇవి తినండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు