India's Godawan : వరల్డ్ బెస్ట్ సింగిల్ మాల్ట్ విస్కీగా భారత గోడవాన్ .. ఏంటి దీని ప్రత్యేకత? ఇదో ప్రత్యేకమైన సింగిల్ మాల్ట్ విస్కీ. ఇండియన్ బొటానికల్స్ కలిపి.. ప్రత్యేకంగా ఎంపిక చేసిన బ్యారెళ్లలో ఈ విస్కీని తయారుచేస్తారు. అయితే మద్యపానం హానికరం కదా దీనిలో ప్రత్యేకత ఏముంది అని అనుకంటారేమో..అది తెలియాలంటే ఇది చదివేయండి! By Durga Rao 24 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Liquor : మద్యపానం ఆరోగ్యానికి హానికరమే. ఐతే.. గోడవాన్ 100 సింగిల్ మాల్ట్ విస్కీ(100 Single Malt Whisky) తాగేవారు మాత్రం గర్వంగా ఫీలవుతారు. ఎందుకంటే.. ఇప్పుడు ప్రపంచంలో బెస్ట్ విస్కీ అదే. దీన్ని గోడవాన్ సెంచరీ(Godawan Century) అని పిలుస్తారు. ఇది భారత్(India) లో తయారయ్యే సింగిల్ మాల్ట్ విస్కీ. ఇది 2024 లండన్ స్పిరిట్స్ కాంపిటీషన్‌లో టాప్ స్కోర్ సాధించింది. సింగిల్ మాల్ట్ విస్కీ కేటగిరీలో ఇది టాప్‌లో నిలిచింది. దీనికి అత్యధికంగా 96 పాయింట్లు వచ్చాయి. ఫలితంగా ఇండియా నుంచి అత్యధిక స్కోర్ సాధించిన ఉత్పత్తిగా ఇది నిలిచింది. దీన్ని టేస్ట్ చూసిన లండన్ స్పిరిట్ కాంపిటీషన్ దీని గురించి ఏమందో తెలుసా.. “ఇది ఉష్ణమండల ప్రాంతం నుంచి వచ్చిన సింగిల్ మాల్ట్ విస్కీ. తేలికైనది, సరైన ఫినిష్ ఇచ్చేది. ఇది క్యారామెల్, చార్ కోల్, దాల్చినచెక్క, సోంపుల సువాసనలతో నోటికి తీపి రుచిని ఇస్తోంది. ఇది లాంగ్ డ్రై ఫినిష్ ఇస్తోంది” అని తెలిపింది. లండన్ స్పిరిట్స్ కాంపిటీషన్‌లో మరోసారి క్వాలిటీ, విలువైన, చక్కని ప్యాకేజ్ కలిగిన మంచి మద్యాలు.. అవార్డులు గెలుచుకొని.. మెరుపులు మెరిపింతాయి. గోడవాన్ సింగిల్ మాల్ట్ విస్కీని.. డియాజియో ఇండియా కంపెనీ తయారుచేస్తోంది. రాజస్థాన్ నుంచి ఈ విస్కీ ప్రపంచం అంతటా వెళ్తుంది. రాజస్థాన్ లోని పొడి వాతావరణం.. ఈ విస్కీ తయారీకి అనువైనది. ఇది అసాధారణమైన ఫ్లేవర్ కలిగి.. అద్భుతమైన వాసన వస్తుంది. ఇండియన్ బొటానికల్స్ కలిపి.. ప్రత్యేకంగా ఎంపిక చేసిన బ్యారెళ్లలో ఈ విస్కీని తయారుచేస్తారు. గోడవాన్‌కి 100 అనే పేరు పెట్టడానికి కారణం.. ఇలాంటి విస్కీని 100 బాటిల్స్ మాత్రమే తయారుచేసింది. కంపెనీ 100వ వార్షికోత్సవం సందర్భంగా వీటిని తయారుచేసింది. గోడవాన్ అనేది ఇండియాలో కనిపించే ఓ పక్షి. దీన్నే గ్రేట్ ఇండియన్ బస్టార్డ్(Great Indian Bastard) అని అంటారు. ఈ పక్షులు ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 100 కూడా లేవు. ఈ పక్షుల సంఖ్యను పెంచేందుకే గోడవాన్ 100 విస్కీని తెచ్చారు. దీని ద్వారా వచ్చే డబ్బుతో.. ఈ పక్షుల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విస్కీ బాటిల్ ధర రూ.92వేల దాకా ఉంది.ఈ సంవత్సరం 2024 లండన్ స్పిరిట్స్ కాంపిటీషన్‌లో ఇండియాతోపాటూ.. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, నెదర్లాండ్స్ కూడా టాప్ దేశాలుగా ఎంట్రీస్ పొందాయి. Also Read : సీఆర్‌ఫీఎఫ్ క్యాంపులో గన్ మిస్‌ఫైర్.. డీఎస్పీ మృతి #viral-news #godawan-century #100-single-malt-whisky మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి