No Visa : భారతీయులకు వీసా అక్కర్లేదు..ఆ దేశం కీలక నిర్ణయం!

ఇక నుంచి ఇరాన్‌ పర్యటించే భారతీయులకు వీసా అవసరం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశ ఆర్థికాభివృద్దిని పెంచుకోవడంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న ఇరాన్‌ ఫోబియాను పారద్రోలేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

New Update
No Visa : భారతీయులకు వీసా అక్కర్లేదు..ఆ దేశం కీలక నిర్ణయం!

No Visa To Indian Tourists : భారతీయ పర్యాటకులకు(Indian Tourists)  తమ దేశంలో పర్యటించేందుకు ఎలాంటి వీసా అక్కర్లేదంటూ మరో దేశం ముందుకు వచ్చింది. ఇప్పటికే తమ దేశాల్లో పర్యటించేందుకు వీసా లేదని శ్రీలంక(Srilanka), మలేషియా(Malaysia), థాయ్‌ లాండ్‌, కెన్యా దేశాలు ప్రకటించగా ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి ఇరాన్‌(Iran) కూడా వచ్చి చేరింది.

ఈ అవకాశాన్ని భారత్‌(Bharat), గల్ఫ్‌(Gulf) తో సహా మరో 33 దేశాల పర్యాటకులకు ఈ అవకాశాన్ని ఇస్తున్నట్లు ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడంతో పాటు ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులను తమ దేశానికి రప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్‌ గవర్నమెంట్‌ వెల్లడించింది.

శుక్రవారం జరిగిన కేబినెట్‌ మీటింగ్‌ తరువాత ఆ దేశ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక హస్తకళల మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి ఈ విషయాన్ని స్వయంగా మీడియాకి తెలిపారు. ఇప్పటికే ఈ దేశానికి వీసా లేకపోయినా రావడానికి తుర్కియే, అజర్‌బైజాన్‌, ఒమన్‌, చైనా, అర్మేనియా, లెబనాన్‌, సిరియా దేశాల పర్యాటకులకు అవకాశం ఉంది.

ఇప్పుడు తాజాగా భారతీయులకు కూడా ఈ అవకాశం లభించింది. దీంతో వీసా అవసరం లేకుండానే ఇరాన్‌ లో పర్యటించేందుకు భారత్‌ 45 వ దేశంగా చేరింది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రపంచ దేశాల్లో ఇరాన్‌ ఫోబియా ప్రచారానికి కూడా స్వస్తి పలకినట్లు అవుతుందని వివరించారు.

ఇప్పుడు తాజాగా భారత్‌ చేరడంతో ...భారత్‌, మౌరిటానియా, టాంజానియా, జింబాబ్వే, మారిషస్‌, రష్యా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, కువైట్‌, లెబనాన్‌, ఉజ్బెకిస్తాన్‌, కిర్గిజాస్తాన్‌, మలేషియా, కాంబోడియా, బ్రెజిల్‌, పెరూ, క్యూబా, మెక్సికో, వెనిజులా, బోస్నియా, హెర్టెగోవినా, సెర్బియా, క్రొయేషియా , బెలారస్‌ దేశాలకు వీసా లేకపోయినా తమ దేశంలో పర్యటించేందుకు ఇరాన్‌ అనుమతిచ్చింది.

కొద్ది రోజుల క్రితమే తమ దేశంలో పర్యటించేందుకు మలేషియా కూడా భారతీయులకు వీసా అవసరం లేదని ప్రకటించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు పెట్టుబడులు పెంచాలనే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దేశం ఆర్థికంగా బాగుపడాలంటే ముందుగా అభివృద్ధి చెందాల్సింది పర్యాటక రంగమని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం వివరించారు. ఇందులో భాగంగానే చైనా, భారత్‌ పౌరులకు వీసా లేకుండానే మలేషియాలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి దీనిని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

వీసా లేకుండా తమ దేశంలో 30 రోజులు పాటు ఉండవచ్చని పేర్కొన్నారు. కానీ వీసా సౌలభ్యం అనేది భద్రత ప్రక్రియకు లోబడి ఉంటుందని వివరించారు. భారత్‌ చైనా నుంచి వచ్చే పర్యాటకులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు వీసా విషయంలో కొన్ని సడలింపులు కూడా ఉంటాయని గత నెలలోనే ఆ దేశ ప్రధాని ప్రకటించారు.

Also read: గ్యాస్ సిలిండర్ ధరపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్…సిద్ధంగా ఉండండి..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

America vs China Tariff War : అమెరికాకు చైనా మరో షాక్.. ఆ విమనాలు కొనొద్దని ఆదేశం

అమెరికా, చైనా మ‌ధ్య సుంకాల యుద్ధం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో అమెకాకు చైనా మరో షాక్‌ ఇచ్చింది. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి విమానాల‌ను ఖ‌రీదు చేయ‌వ‌ద్దు అని త‌మ ఎయిర్లైన్స్ సంస్థల‌కు చైనా ఆదేశాలిచ్చింది.

New Update
America vs China Tariff War

America vs China Tariff War

America vs China Tariff War : అమెరికా, చైనా మ‌ధ్య సుంకాల యుద్ధం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో అమెకాకు చైనా మరో షాక్‌ ఇచ్చింది.అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి విమానాల‌ను ఖ‌రీదు చేయ‌వ‌ద్దు అని త‌మ ఎయిర్లైన్స్ సంస్థల‌కు చైనా ఆదేశాలిచ్చింది. రెండు దేశాల మ‌ధ్య వాణిజ్య అగాధం ఏర్పడ‌డం వ‌ల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ వ‌స్తువుల‌పై అధిక స్థాయిలో సుంకాలు వ‌సూల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. చైనా దిగుమ‌తుల‌పై సుమారు 145 శాతం సుంకాలు వ‌సూలు చేసేందుకు ట్రంప్ స‌ర్కారు నిర్ణయించింది.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!


అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని డ్రాగ‌న్ దేశం తీవ్రంగా ఆక్షేపించింది. అగ్రరాజ్యం చ‌ట్ట వ్యతిరేక కార్యక‌లాపాల‌కు పాల్పడుతున్నట్లు చైనా పేర్కొన్నది. దీంతో ప్రతీకారంగా అమెరికా వ‌స్తువుల‌పై 125 శాతం సుంకాన్ని వ‌సూలు చేసేందుకు నిర్ణయించింది. అమెరికా కంపెనీ నుంచి విమాన ప‌రిక‌రాలు, విడిభాగాల కొనుగోలును నిలిపివేయాల‌ని ఎయిర్‌లైన్స్ సంస్థల‌కు చైనా ఆదేశాలు జారీ చేసింది. దిగుమ‌తి వ‌స్తువుల‌పై సుంకాలు పెర‌గ‌డం వ‌ల్ల.. విమాన ప‌రికాల ధ‌ర మ‌రింత పెరిగిన‌ట్లు చైనా భావిస్తున్నది.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

అమెరికా వస్తువులపై 125 సుంకాలను విధిస్తూ ఇటీవల ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి విమానాల విడిభాగాలను దిగుమతి చేసుకోవద్దని పలు సంస్థలకు సూచించింది. ఈ నిర్ణయంతో బోయింగ్‌ విమానాల నిర్వహణ కూడా చైనా సంస్థలకు భారంగా మారనుంది. అదే సమయంలో ఇప్పటికే బోయింగ్‌ నుంచి విమానాలను లీజుకు తీసుకొని నిర్వహిస్తున్న సంస్థలను ఆదుకొనే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం దెబ్బకు బోయింగ్‌ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే ఆ సంస్థ గత కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. ఆ సంస్థకు చైనా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. రానున్న 20 ఏళ్లలో ప్రపంచ విమానాల మార్కెట్‌లో 20శాతం వాటా చైనాదే అన్న అంచనాలున్నాయి. ఒక్క 2018లోనే 25శాతం బోయింగ్‌ విమానాలను బీజింగ్‌ సంస్థలు కొనుగోలు చేశాయి. కానీ, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా చైనా నుంచి ఎటువంటి కొత్త ఆర్డర్లు బోయింగ్‌కు లభించలేదు.దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న  ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది.  ట్రంప్ టారిఫ్‌లపై చైనా ప్రతిఘటించడంతో అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే.. చైనా దిగుమతి వస్తువుల రేట్లు చాలా ఎక్కువగా ఉండనున్నాయి. ప్రతిఘటించని దేశాలకు 90 రోజుల విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read :  సీఎం రేవంత్ కు తప్పిన పెను ప్రమాదం

Also Read :  రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment