IBSA: వరల్డ్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా అమ్మాయిలు

ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(IBSA)వరల్డ్ గేమ్స్‌లో భారత్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. తొలి ఎడిషన్‌లోనే స్వర్ణం గెలిచి రికార్డు నెలకొల్పారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. అయితే టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో మన అమ్మాయిలు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడం విశేషం.

New Update
IBSA: వరల్డ్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా అమ్మాయిలు

ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(IBSA)వరల్డ్ గేమ్స్‌లో భారత్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. తొలి ఎడిషన్‌లోనే స్వర్ణం గెలిచి రికార్డు నెలకొల్పారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. కేవలం 3.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన మన అమ్మాయిలు సరికొత్త చరిత్రకు నాంది పలికారు. అయితే టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో మన అమ్మాయిలు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడం విశేషం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ జట్టు పరుగులు చేయడానికి చెమటోడ్చింది. దీంతో పవర్‌ప్లేలో కేవలం 29 పరుగులే చేసింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను లూయిస్, వెబెక్ ఆదుకున్నారు. అనంతరం భారత్ బౌలర్లు పుంజుకోవడంతో 16 పరుగుల వ్యవధిలోనే కంగారులు 5 వికెట్లు కోల్పోయింది. అయితే వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 42 పరుగుల లక్ష్యాన్ని ఇండియాకు టార్గెట్‌గా నిర్ణయించగా.. కేవలం 3.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు.

ఇక మరోసారి భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య తుది పోరు జరగనుంది. దాయాది దేశాల మధ్య ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. అదేంటి? ఆసియా కప్ టోర్నీకి ఇంకా టైం ఉంది కదా.. ఇప్పుడు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ మ్యాచ్ జరిగేది పురుషుల అంధుల క్రికెట్ జట్ల మధ్య. IBSA వరల్డ్ గేమ్స్‌లోపురుషుల అంధుల క్రికెట్‌లోనూ భారత్ జట్టు ఫైనల్ చేరింది. దీంతో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య తుది పోరు జరగనుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs MI: క్లాసెన్ క్లాసిక్ గేమ్.. ముంబై ముందు టార్గెట్ ఇదే

సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ ఆడిన SRH జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీంతో MI ముందు 144 టార్గెట్ ఉంది. క్లాసెన్‌ (71), అభినవ్‌ (43) చెలరేగిపోయారు.

New Update
SRH vs MI MATCH

SRH vs MI MATCH

సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ ఆడిన SRH జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీంతో MI ముందు 144 టార్గెట్ ఉంది. క్లాసెన్‌ (71), అభినవ్‌ (43) చెలరేగిపోయారు.

SRH vs MI

ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు ప్రారంభం నుంచే తడబడింది. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరారు. తొలి ఓవర్‌కు 2 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 2 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌ డకౌట్‌ అయ్యాడు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

వెను వెంటనే 2 ఓవర్1వ బంతికి సన్‌రైజర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ (1) ఔట్‌అయ్యాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రికెల్‌టన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే మరో వికెట్ డౌన్ అయింది. 3 ఓవర్ 3వ బంతికి  అభిషేక్‌ శర్మ (8) ఔటయ్యాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా 4 ఓవర్లకు 13/3 స్కోర్‌ చేసింది. 

వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక ఎవరూ ఊహించని రీతిలో నాలుగో వికెట్‌ను హైదరాబాద్ జట్టు కోల్పోయింది. 4 ఓవర్1వ బంతికి నితీశ్‌ కుమార్‌ రెడ్డి (2) ఔట్‌ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేశారు. క్రీజులో అనికేత్‌ వర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌ మెల్లి మెల్లిగా పరుగులు రాబడుతూ వచ్చారు.

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అదే సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. అనికేత్‌ వర్మ (12) ఔట్‌ అయ్యాడు. హార్దిక్‌ పాండ్య వేసిన 8 ఓవర్ 3వ బంతికి వికెట్‌ కీపర్‌ రికెల్‌టన్‌కు క్యాచ్‌ ఇచ్చి అనికేత్‌ వెనుదిరిగాడు. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 35 పరుగుల వద్ద 5వ వికెట్‌ కోల్పోయింది. ఇలా వరుస వికెట్ల నష్టంతో హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లందరూ ఔటవడంతో కనీసం 100 పరుగులు అయినా చేస్తారా? అనే సందేహంలో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ క్లాసెన్ క్లాసిక్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 

నిలకడగా ఆడిన క్లాసెన్‌ (71) ఔట్‌ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఆరో వికెట్‌ కోల్పోయింది. వెను వెంటనే ఏడో వికెట్‌ డౌన్‌ అయింది. అభినవ్‌ (43), కమిన్స్ (1) ఔట్‌ అయ్యారు. దీంతో 20 ఓవర్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 

 telugu-news | srh-vs-mi | latest-telugu-news | IPL 2025 SRH vs MI Live Score

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు