యూకేలో మిస్సైయిన భారతీయ విద్యార్థి కథ విషాదాంతం..థేమ్స్‌ నదిలో శవమై తేలి!

లండన్‌ లో ఉన్నత చదువులు చదవడానికి వెళ్లిన భారత సంతతికి చెందిన మిత్‌ కుమార్‌ అనే విద్యార్థి థేమ్స్‌ నదిలో శవమై కనిపించాడు. గత నెలలో కనిపించకుండా పోయిన మిత్‌ మృతదేహం కనిపించడం విషాదాన్ని నింపింది.

New Update
యూకేలో మిస్సైయిన భారతీయ విద్యార్థి కథ విషాదాంతం..థేమ్స్‌ నదిలో శవమై తేలి!

గత అక్టోబర్‌ లో లండన్ లో తప్పిపోయిన భారతీయ విద్యార్థి మిత్‌ కుమార్‌ పటేల్‌ కథ విషాదంగా ముగిసింది. వాకింగ్‌ కోసమని బయటకు వెళ్లిన మిత్‌ కుమార్‌ తరువాత ఇంటికి తిరిగి రాలేదు.దీంతో అతని స్నేహితులు , బంధువులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే నవంబర్‌ 21న తూర్పు లండన్‌ లోని కానరీ వార్ప్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న థేమ్స్‌ నదిలో మిత్‌ కుమార్‌ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అయితే మిత్‌ మృతి చెందాడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మిత్‌ వయసు 23 ఏళ్లు. అతను ఈ ఏడాది సెప్టెంబర్‌ లోనే లండన్‌ కి వెళ్లాడు. మిత్‌ మృతి చెందడంతో అతని బంధువు ఒకరు మృతదేహాన్ని భారత్‌ కి తీసుకుని రావడానికి విరాళాలు సేకరిస్తున్నాడు . అతి త్వరలోనే మిత్‌ డెడ్‌ బాడీని భారత్‌ కి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మిత్‌ షెఫీల్డ్‌ హాలం యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ అమెజాన్‌ లో పార్ట్‌ టైమ్ జాబ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను చనిపోవడం విషాదాన్ని నింపింది.

Also read: నేను అలా అనలేదు..క్లారిటీ ఇచ్చిన కాంతారా హీరో!

Advertisment
Advertisment
తాజా కథనాలు