ప్రభుత్వ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..జీతం రూ.90 వేల పైనే..ఇంకెందుకు ఆలస్యం! ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ విడుదల చేయడం జరిగింది.అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తుకు చివరి తేది...నవంబర్ 19 By Bhavana 13 Nov 2023 in నేషనల్ New Update షేర్ చేయండి బ్యాంకులో ఉద్యోగం చేయాలనేది చాలా మంది కల. దాని కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడే వారు చాలా మంది ఉంటారు. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ విడుదల చేయడం జరిగింది. చెన్నై ప్రధాన కేంద్రంగా దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్న ఈ బ్యాంకులో వివిధ విభాగాల్లో ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందులో 66 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు... ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ, లా, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఆర్క్, సీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజేడీబీఎం, సీబీసీఏ, సీఏలో ఉత్తీర్ణులై ఉండాలి. కొంతకాలం పాటు సంబంధిత విభాగాల్లో పని చేసి ఉండాలి. ఇందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 25 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం సంబంధిత వర్గాల అభ్యర్థులకు వయో పరిమితి సడలింపులు వర్తిస్తాయి. దీనికి పోస్టులను అనుసరించి రూ. 48 వేల నుంచి రూ.89 వేల వరకు జీతభత్యాలు ఉంటాయి. రెండు సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఇంటిమేషన్ ఛార్జీల కింద రూ. 175 చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ. 850 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి దేశంలోని ఐఓబీ బ్యాంకు శాఖల్లో పోస్టింగ్ కల్పిస్తారు. వయోపరిమితి సడలింపులు, పరీక్షా తేదీ, ఎగ్జామ్ సిలబస్ తదితర వివరాల కోసం IOB అధికారిక వెబ్సైట్ https://www.iob.in/Careersను సందర్శించవచ్చు.దరఖాస్తు చివరి తేదీ..2023 నవంబర్ 19 Also read: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో! #officers #bank-jobs #iob మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి