AI వాడకంపై కొత్త రూల్స్.. కేంద్ర మంత్రి సంచలన ప్రకటన! కేంద్ర ప్రభుత్వం మరో కీలక చట్టాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకాన్ని నియంత్రించేందుకు కొత్త బిల్లును అమల్లోకి తేనున్నట్లు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. By V.J Reddy 04 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rajeev Chandrasekhar On AI: కేంద్ర ప్రభుత్వం మరో కీలక చట్టాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) వాడకాన్ని నియంత్రించేందుకు కొత్త బిల్లును అమల్లోకి తేనున్నట్లు సమాచారం. దీనిపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. Also Read: టీమ్ ఇండియాకు షాక్..మెగాటోర్నీ నుంచి హార్దిక్ పాండ్యా అవుట్ ఇంటర్నెట్ వాడుతున్న భారత పౌరులకు AI ద్వారా కానీ, మరే ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా హాని జరిగితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఒకవేళ ఏ సంస్థ అయిన యూజర్ల డేటాను చోరీ చేస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) నియంత్రణతో పాటు డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడుతామని తేల్చి చెప్పారు. AI వాడకం ద్వారా దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయి నిరుద్యోగ రేటు పెరుగుతుందని.. అనేక మంది తమ ఉద్యోగాలు కోల్పోతారు అని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. AI వల్ల లాభాలు, నష్టాలు రెండు ఉన్నాయని.. కానీ రాబోయే రోజుల్లో భారత దేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడం ద్వారా అనేక ఉద్యోగావకాశలు వస్తాయని అన్నారు. ఫ్యూచర్‌లో ఉద్యోగాలు కోల్పోవడం, తొలిగించడం వంటివి అన్ని అపోహలే అని కొట్టిపారేశారు. Also Read: కర్ణాటకలో చీకట్లు…కరెంట్ లేక అవస్థలు పడుతున్న జనాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000కి ప్రత్యామ్నాయంగా చెప్పబడుతున్న డిజిటల్ ఇండియా బిల్లుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, జూన్‌లో ముసాయిదా బిల్లును విడుదల చేయనున్నట్లు.. దాంతో పాటుగా 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సేఫ్ హార్బర్’(Safe Harbour) బిల్లుపై కూడా కసరత్తు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభిస్తే డిజిటల్ ప్లాట్ ఫాంలపై కఠిన ఆంక్షలు ఉండి.. ఇంటర్నెట్ యూజర్ల డేటాకు భద్రత మరింత మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి. Do Watch: మంత్రి ఎర్రబెల్లిపై యశస్వినీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు: #artificial-intelligence #rajeev-chandrasekhar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి