చంద్రయాన్-3 సక్సెస్‌తో టీమిండియా క్రికెటర్ల సంబరాలు

జాబిల్లిపై భారత త్రివర్ణ పతకం రెపరెపలాడటంతో దేశమంతా సంబురాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తోంది. ప్రపంచమంతా మనవైపే చూసింది. యావత్ ప్రపంచం మనల్ని కీర్తిస్తోంది. ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు కూడా చంద్రయాన్-3 విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

New Update
చంద్రయాన్-3 సక్సెస్‌తో టీమిండియా క్రికెటర్ల సంబరాలు

జాబిల్లిపై భారత త్రివర్ణ పతకం రెపరెపలాడటంతో దేశమంతా సంబురాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తోంది. ప్రపంచమంతా మనవైపే చూసింది. యావత్ ప్రపంచం మనల్ని కీర్తిస్తోంది. ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు కూడా చంద్రయాన్-3 విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఐరీష్ జట్టుతో మూడో టీ20 మ్యాచ్‌కు ముందు మన ఆటగాళ్లు టీవీకి అతుక్కుపోయారు. భారతదేశం మొత్తం ఎలాగైతే నరాలు తెగే ఉత్కంఠతో ఈ ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షించారో.. అలాగే మన క్రికెటర్లు కూడా టీవీలో లైవ్ చూస్తూ టెన్షన్ టెన్షన్‌గా ఉండిపోయారు. చందమామపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపగానే విజయగర్వంతో ఊగిపోయారు. ఒకరినొకరు హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ట్ పేజీలో పోస్ట్ చేసింది.

ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయంపై భారత క్రికెటర్లు అందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా, రహానే, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సిరాజ్, దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, తదితర క్రికెటర్లు ఇస్రో శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఐపీఎల్ ప్రాంఛైజీలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ కూడా తమ సంతోషం వ్యక్తంచేశాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పేస్ ఏజెన్సీలు, ప్రముఖ మీడియా సంస్థలు భారత్‌ను ఆకాశానికెత్తుతూ ట్వీట్స్ చేస్తున్నాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వస్తే డ‌బ్లిన్ వేదిక‌గా జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి బుమ్రా సేన సిరీస్ సొంతం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ క్లీన్ స్వీప్ చేయాలని ఊవిళ్లూరుతోంది. మరోవైపు ఐర్లాండ్ కూడా ఈ మ్యాచ్‌లో నెగ్గి భారత్‌కు షాక్ ఇవ్వాలని చూస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు