/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-22-6.jpg)
Yuvraj Singh : భారత క్రికెట్ జట్టుకు కీలకమైన ఆటగాడిగా ఎన్నో విజయాలు సాధించిన యువరాజ్ సింగ్ జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కబోతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్ యువీ బయోపిక్‌ను రూపొందించనుంది. నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.
యువరాజ్ సింగ్, తన కెరీర్‌లో అనేక రికార్డులు సృష్టించి, భారత క్రికెట్ అభిమానుల మనస్సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. అతని జీవిత కథలోని అద్భుతమైన ఘట్టాలు, ఆట పట్ల అతని అభిరుచి, అతని కెరీర్‌లో ఎదురైన సవాళ్లు మరియు విజయాలను ఈ బయోపిక్‌లో చూపించబోతున్నారు. యువరాజ్ సింగ్ తన జీవిత కథను తెరపై ప్రదర్శించడం పట్ల ఆసక్తి చూపించాడు. అతను ఈ ప్రాజెక్ట్‌కు సహకరిస్తూ, తన అనుభవాలను తెరపై ప్రతిబింబించడంలో సహాయపడనున్నాడు.
Relive the legend's journey from the pitch to the heart of millions—Yuvraj Singh's story of grit and glory is coming soon on the big screen! 🎬#SixSixes@yuvstrong12 @ravi0404#BhushanKumar #KrishanKumar @shivchanana @neerajkalyan_24 #200NotOutCinema @TSeries pic.twitter.com/53MsfVH476
— T-Series (@TSeries) August 20, 2024
Also Read : మాలీవుడ్‌లో మహిళలకు నరకమే..హేమ కమిటీ రిపోర్ట్‌లో ఆశ్చర్యకర అంశాలు
కాగా ఇందులో యూవీ పాత్రలో హీరోగా ఎవరు కనిపిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక 2000లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువరాజ్.. సుమారు 17 ఏళ్ల పాటు ఇండియా టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2019లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.