ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయంగా సరికొత్త రికార్డు.. ఇంతకీ అదెక్కడంటే..? ప్రపంచంలో ఎన్నో అద్బుతమైన ఎత్తైనా కట్టడాలను ఎక్కడో ఒక దగ్గరా చూసుంటాం కదా.. కానీ.. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం అనే బిరుదు ఒక్క అమెరికాకు దేశానికి చెందిన పెంటగాన్‌కు మాత్రమే ఉండేది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా పిలుస్తారు. ప్రస్తుతం దీనిని అధిగమించి భారత్‌లోని ముంబైకి ఉత్తరాన 150 మైళ్ల దూరంలో సూరత్ ఈ భారీ భవనానికి వేదికగా మారింది. అంతేకాదు టూరిస్ట్ ప్లేస్‌గా మారనుంది. By Shareef Pasha 19 Jul 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి ఇప్పుడు పెంటగాన్ పేరును చెరిపేస్తూ త్వరలో భారత్ తన ఖాతాలో వేసుకోనుంది. అయితే ఈ భవనాన్ని గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల వ్యాపారి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇదే హాట్ టాఫిక్‌గా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనాన్ని గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మిస్తున్నారు. ఇది సూరత్ వజ్రాల వ్యాపార కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ భవనాన్ని డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌గా కూడా ఉపయోగించనున్నారు. ఈ భవనం పూర్తి చేయడానికి సుమారు నాలుగేళ్లు పట్టింది. అసలు విషయం ఏంటంటే... ప్రపంచంలోని 90 శాతం వజ్రాలు సూరత్‌లోనే తయారవుతున్నాయి. మరోవైపు.. మనం అమెరికా పెంటగాన్ గురించి చెప్పుకున్నట్లయితే.. ఇది గత 80 ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయంగా పేరు సంపాదించుకుంది. కానీ ఇప్పుడు ఈ టైటిల్ సూరత్ డైమండ్ బోర్స్‌కు సొంతం చేసుకోబోతోంది. సూరత్ డైమండ్ బోర్స్ అంటే ఏమిటి? ఈ అద్భుతమైన భవనానికి సూరత్ డైమండ్ బోర్స్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోని రత్నాల రాజధానిగా ప్రసిద్ధి చెందిన సూరత్‌లోని ఈ భవనం ‘వన్ స్టాప్ డెస్టినేషన్’గా నిర్మించబడింది. CNN నివేదిక ప్రకారం.. ఈ భవనం మొత్తం 15 అంతస్తులుగా నిర్మించారు. ఇది 35 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో వజ్రాల వ్యాపారంతో సంబంధం ఉన్న పాలిషర్లు, కట్టర్లు, వ్యాపారులు అందరికీ సౌకర్యాలు కల్పించారు. ఈ భవనం తొమ్మిది దీర్ఘచతురస్రాకార నిర్మాణాల రూపంలో తయారు చేయబడింది. అవన్నీ సెంట్రల్ వెన్నెముక రూపంలో ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ భవనాన్ని తయారు చేస్తున్న సంస్థ మొత్తం 7.1 మిలియన్ చదరపు అడుగుల భూమిని కలిగి ఉందని పేర్కొంది. 2023 నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ అద్భుతమైన భవనాన్ని నిర్మించడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. వజ్రాల వ్యాపారులకు ప్రధాన కేంద్రంగా.. మొత్తం 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కాంప్లెక్స్‌లో వినోదం, పార్కింగ్ ప్రాంతం ఉంది. SDB డైమండ్ బోర్స్ అనేది కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 కింద నమోదు చేయబడిన లాభాపేక్షలేని సంస్థ. ఈ కొత్త భవన సముదాయం వేలాది మంది వజ్రాల వ్యాపారులకు ప్రధాన కేంద్రంగా నిరూపిస్తుందని ఈ ప్రాజెక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేష్ గధ్వి తెలిపారు. దీంతో వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు రోజువారీ రైలు ప్రయాణం నుంచి కూడా విముక్తి కలుగుతుంది. సూరత్ డైమండ్ బోర్స్ డిజైన్‌ను అంతర్జాతీయ స్థాయి పోటీ తర్వాత భారతీయ సంస్థ మార్ఫోజెనిసిస్ రూపొందించింది. ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. ఈ భవనాన్ని నిర్మించేటప్పుడు మేము అమెరికా పెంటగాన్‌ను విడిచిపెడతామని కూడా అనుకోలేదని మహేష్ గధ్వి అన్నారు. వ్యాపారుల సౌకర్యార్థం మాత్రమే తయారు చేశాం. దీనితో పాటు డైమండ్ ట్రేడ్ హబ్‌లో వజ్రాల తయారీ కంపెనీలు భవన నిర్మాణానికి ముందే తమ కార్యాలయాలను కొనుగోలు చేశాయని ఆయన చెప్పారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి