Indian Bank Jobs: డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు వారాలే గడువు! డిగ్రీ అర్హతతో 102 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ బ్యాంక్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2024 జులై 14 వరకూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అధికారిక వెబ్ సైట్: https://www.indianbank.in/career/ By srinivas 03 Jul 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి Indian Bank Recruitment 2024: నిరుద్యోగులకు ఇండియన్ బ్యాంక్ (Indian Bank) గుడ్ న్యూస్ చెప్పింది. తమ శాఖలో ఖాళీగా ఉన్న 102 పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థులను నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలని సూచించింది. మొత్తం ఖాళీలు : 102 డిప్యూటీ వైస్ ప్రెసిడెండ్ పోస్టులు: 30 అసిస్టెంట్ వైస్ ప్రెసిడెండ్ పోస్టులు: 72 విద్యా అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, ఎంబీఏ, కోర్సు సర్టిఫికేట్, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి. విభాగాలు: క్రెడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్‌ఎంఈ, రిస్క్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో ఖాళీల భర్తీ. కనీస వయసు: డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 40 ఏళ్లు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కు 38 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ వేదికగా 2024 జులై 14 వరకూ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లించాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్: https://www.indianbank.in/career/ #indian-bank #specialist-cadre-officer #102-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి