3,500 పోస్టులకు నోటిఫికేషన్‌.. టీనేజ్‌లోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్‌..!

3,500కు పైగా అగ్నివీర్‌ ఖాళీలను భర్తీ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఆగస్టు 17 వరకు అప్లికేషన్‌ని ఫిల్‌ చేసుకునే అవకాశముంది. మొత్తం మూడు దశల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుండగా సెలక్ట్ అయిన వారికి అగ్నివీర్ ప్యాకేజీ కింద నెలకు రూ.30వేలు ఇస్తారు

New Update
3,500 పోస్టులకు నోటిఫికేషన్‌.. టీనేజ్‌లోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్‌..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం(Central Government Jobs) కోసం పోటి పడే వారు కోట్లలో ఉంటారు. అందులోనూ తక్కువ వయసులోనే సెంట్రల్ గవర్నమెంట్‌ జాబ్ వస్తుందంటే అప్లై చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ వాయు రిక్రూట్‌మెంట్ ద్వారా అగ్నివీర్ (agniveer) పోస్టులను భర్తీ చేయనుంది. దీని కోసం 3,500కు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian airforce) నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. IAF అగ్నివీర్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ జూలై 27న ప్రారంభమవగా అది ఆగస్టు 17, 2023 వరకు కొనసాగుతుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. IAF అగ్నివీర్ పరీక్ష ఈ ఏడాది అక్టోబర్ 13న జరుగుతుంది. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులందరికీ అగ్నివీర్ ప్యాకేజీ కింద నెలకు రూ.30వేలు ఇస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్‌లో ఆన్‌లైన్ టెస్ట్, సెకండ్ ఫేజ్‌లో ఆన్‌లైన్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT), అలాగే అడాప్టబిలిటీ టెస్ట్ 1, 2 ఉంటాయి. ఫేజ్-3లో మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది.

IAF అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ వయో పరిమితి(age limit):
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస వయసు 17.5 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 21 ఏళ్లు ఉండాలి. అలాగే.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా 27 జూన్ 2003- 27 డిసెంబర్ 2006 మధ్య పుట్టి ఉండాలి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ దరఖాస్తు రుసుము(application fee):
అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి. డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లింపు చేయవచ్చు.

IAF అగ్నివీర్ వాయు 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి:
స్టెప్ 1: ముందుగా agnipathvayu.cdac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో అభ్యర్థి లాగిన్ విభాగంపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను ఫిల్ చేసి, లాగిన్ చేయండి.

స్టెప్ 4: అగ్నివీర్ వాయు 2024 ఫారమ్‌ను పూరించండి, రుసుము చెల్లించి సబ్మిట్‌పై క్లిక్‌ చేయండి.

స్టెప్ 5: అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌ అవుట్ తీసుకోండి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ శాలరీ: రూ.30,000

అలవెన్సులు: శాలరీతో పాటు అగ్నివీర్ రిస్క్, హార్డ్‌షిప్ అలవెన్సులు, డ్రెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్సులు ఉంటాయి. కొన్ని పెర్క్‌లలో రేషన్, వసతి అలవెన్స్‌ కూడా ఉంటుంది.

సెలవు: సంవత్సరానికి 30 రోజులు

Advertisment
Advertisment
తాజా కథనాలు