WCL 2024 Final: పాకిస్తాన్ చిత్తు.. ఇండియా లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్స్!

వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్స్ లో పాకిస్తాన్ లెజెండ్స్ ను ఇండియా లెజెండ్స్ చిత్తు చేశారు. ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించి వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ గా టీమిండియా లెజెండ్స్ నిలిచారు. 

New Update
WCL 2024 Final: పాకిస్తాన్ చిత్తు.. ఇండియా లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్స్!

Ind vs Pak WCL 2024: మాజీ క్రికెటర్ల కోసం నిర్వహిస్తున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ 2024 విజయవంతంగా ముగిసింది.  ఈ టోర్నీలో భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌లో భారత ఛాంపియన్‌లు, పాకిస్థాన్ ఛాంపియన్‌లు తలపడ్డారు. ఈ  ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ ఛాంపియన్‌గా అవతరించింది.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ (WCL 2024 Final) ఫైనల్ మ్యాచ్‌లో భారత ఛాంపియన్స్ జట్టు విజయం సాధించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ జట్టుకు తొలి షాక్ ఇవ్వడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు.

2వ ఓవర్ చివరి బంతికి షర్జీల్ ఖాన్ (12) షార్జీల్ ఖాన్ (12) వికెట్ తీసి భారత ఛాంపియన్స్ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు అనురీత్ సింగ్. దీని తర్వాత మక్సూద్ (21) వికెట్ పడగొట్టడంలో వినయ్ కుమార్ సఫలమయ్యాడు. కాగా, కమ్రాన్ అక్మల్ 19 బంతుల్లో 24 పరుగులు చేశాడు.

ఆ తర్వాత షోయబ్ మాలిక్ 36 బంతుల్లో 41 పరుగులు చేయగా, మిస్బా ఉల్ హక్ 18 పరుగులు చేశాడు. దీంతో పాక్ ఛాంపియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.

భారత ఛాంపియన్స్ అద్భుత బ్యాటింగ్:
WCL 2024 Final:  157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఛాంపియన్స్ జట్టుకు కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్ రాబిన్ ఉతప్ప 10 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యి నిరాశపరిచాడు. అయితే ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు అద్భుత ప్రదర్శన చేశాడు. పాక్ ఛాంపియన్స్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న రాయుడు 30 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన సురేశ్ రైనా 3 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. 

నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన గురుకీరత్ సింగ్ మాన్ 33 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ దశలో బరిలోకి దిగిన యూసుఫ్ పఠాన్ 16 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, 1 ఫోర్తో 30 పరుగులు చేసి మ్యాచ్ మళ్లీ భారత్ వైపు మొగ్గు చూపేలా చేశాడు.

WCL 2024 Final:  చివరకు 19.1 ఓవర్లలో యువరాజ్ సింగ్ అజేయంగా 15 పరుగులు, ఇర్ఫాన్ పఠాన్ అజేయంగా 5 పరుగులు చేశారు. దీంతో భారత ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్స్  ను ఓడించి మొట్టమొదటి ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీని గెలుచుకుంది.

పాకిస్థాన్ ఛాంపియన్స్ ప్లేయింగ్ 11: కమ్రాన్ అక్మల్ (వికెట్ కీపర్), షార్జిల్ ఖాన్, సోహైబ్ మక్సూద్, షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్ (కెప్టెన్), షాహిద్ అఫ్రిది, మిస్బా-ఉల్-హక్, అమీర్ యామిన్, సొహైల్ తన్వీర్, వాహబ్.

ఇండియా ఛాంపియన్స్ ప్లేయింగ్ 11: రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), అంబటి రాయుడు, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ (కెప్టెన్), యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, అనురీత్ సింగ్, గురుకీరత్ సింగ్ మోన్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

గతేడాది వరదల్లో వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని చనిపోయారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు పెట్టి గౌరవించింది. ఆమె తండ్రితో వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ ఆఖేరు వాగు వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

New Update
scientist ashwini

scientist ashwini

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. 

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Advertisment
Advertisment
Advertisment