India vs Srilanka: శ్రీలంక స్పిన్నర్ల ధాటికి టీమిండియా విలవిలా.. షనక సేన టార్గెట్‌ ఎంతంటే?

ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంకపై పోరులో భారత్‌ బ్యాటర్లు రాణించలేకపోయారు. కెప్టెన్ రోహిత్‌ మినహా మిగిలిన ప్లేయర్లు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కోహ్లీ, పాండ్యా ఫెయిల్ అయ్యారు శ్రీలంక బౌలర్లలో దునిత్‌ వెల్లాలగే ఐదు వికెట్లు తియ్యగా.. చరిత్ అసలంక 4 వికెట్లతో భారత్‌ బ్యాటర్ల నడ్డి విరిచాడు.

New Update
India vs Srilanka: శ్రీలంక స్పిన్నర్ల ధాటికి టీమిండియా విలవిలా.. షనక సేన టార్గెట్‌ ఎంతంటే?

ASIA CUP 2023 INDIA VS SRILANKA: టీమిండియా బ్యాటర్లు అలిసిపోయినట్టు క్లియర్‌కట్‌గా కనిపిస్తోంది. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 49 ఓవర్లలో 213 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయ్యింది. మ్యాచ్‌ చివరిలో వర్షం అంతరాయం కలిగించినా తర్వాత రెయిన్ తగ్గిపోవడంతో ఓవర్లు కుదించకుండానే మ్యాచ్‌ స్టార్ట్ అయ్యింది. నిన్న రిజర్వ్ డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై చెలరేగిన భారత్ ఇవాళ తేలిపోయింది. శ్రీలంక స్పిన్నర్లలో దునిత్‌ వెల్లాలగే ఐదు వికెట్లతో అదరగొట్టాడు. చరిత్ అసలంక 4 వికెట్లతో భారత్‌ బ్యాటర్ల నడ్డి విరిచాడు.


రోహిత్ నువ్వు కేక బ్రో:
ఆసియా కప్‌ సూపర్‌-4లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి వచ్చాడు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించనుండడంతో శార్దూల్‌ స్థానంలో అక్షర్‌కు చోటిచ్చినట్లు టీమిండియా సారథి రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన ఇండియాకు కెప్టెన్ రోహిత్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. తన ఫామ్‌ని కంటిన్యూ చేస్తూ బౌండరీలతో అటాకింగ్‌ గేమ్ ఆడాడు. 48 బంతుల్లో 53 పరుగులు చేసిన రోహిత్ దునిత్ వెల్లాలగే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఫిఫ్టి బాదిన రోహిత్ శర్మ ఖాతాలో రికార్డులు వచ్చి పడ్డాయి. శ్రీలంక పేసర్ రజిత బౌలింగ్ లో భారీ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ దిగ్గజాల సరసన చేరాడు. శ్రీలంకతో మ్యాచ్ ముందు వరకు కూడా రోహిత్ శర్మ వన్డేల్లో 247 మ్యాచ్‌ల్లో 9,978 పరుగులతో ఉన్నాడు. లంకతో జరిగిన పోరులో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు ఉద్ద ఉన్న సమయంలో రోహిత్ భారీ సిక్సర్ బాదాడు. దీంతో పది వేల మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరఫున వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆరో ప్లేయర్‌ రోహిత్ శర్మ. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, ద్రవిడ్, ధోని తర్వాత వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు.


రోహిత్ మినహా:
ఇక రోహిత్ మినహా మగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేకపోయారు. పాక్‌పై సెంచరీ బాదిన కేఎల్‌ రాహుల్ పర్వాలేదనిపించాడు. 44 బంతుల్లో 39 రన్స్ చేశాడు. ఇషాన్‌ కిషన్‌ స్లో బ్యాటింగ్ చేశాడు. 61 బంతుల్లో 33 పరుగులు చేశాడు. కోహ్లీ 3 పరుగులకే అవుటై పూర్తిగా నిరాశపరిచాడు. అటు పాండ్యా సైతం 18 బంతులు ఆడి కేవలం 5 పరుగులే చేశాడు. దీంతో టీమిండియా 200 పరుగుల మార్క్‌ని దాటడం కష్టమే అనిపించింది. అయితే ఆఖరిలో ఆక్షర్ పటేల్ 36 బాల్స్‌లో 26 రన్స్‌ చేసి 200 మార్క్‌ దాటేలాగా చేశాడు.

ALSO READ: హర్షా భోగ్లే మొదటి పే చెక్‌ ఫొటో వైరల్‌.. మీరు తోపు సర్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు