IND VS AUS: టీ20 చరిత్రలోనే పరమ చెత్త గణాంకాలు.. అసలు ఏంటి భయ్యా నువ్వు!

ఆస్ట్రేలియాపై మూడో టీ20లో టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ నాలుగు ఓవర్లకు 68 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాదు భారత్‌ బౌలర్లలో టీ20ల్లో అత్యంత చెత్త ఎకానమీ కలిగిన బౌలర్‌ కూడా కృష్ణనే. అతని ఎకానమీ 11గా ఉంది.

New Update
IND VS AUS: టీ20 చరిత్రలోనే పరమ చెత్త గణాంకాలు.. అసలు ఏంటి భయ్యా నువ్వు!

అసలు బౌలింగ్‌ వెయ్యాలన్న ఇంట్రెస్టే అతడిలో కనిపించలేదు. ఏదో వచ్చామా.. భారీగా రన్స్ ఇచ్చామా.. మళ్లీ ఓవర్‌ వేశామా అన్నట్లు సాగింది టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ(Prasidh Krishna) తీరు. ఆస్ట్రేలియా(Australia)పై జరిగిన మూడో టీ20లో పేసర్ ప్రసిద్ కృష్ణ ఘోరాతి ఘోరంగా బౌలింగ్‌ వేశాడు. అతడి చెత్త బౌలింగ్‌ వల్లే ఇండియా ఓడిపోయిందని అభిమానులు మండిపడుతున్నారు. నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్‌లో 21 రన్స్‌ కొట్టాల్సిన ఆస్ట్రేలియాను దగ్గరుండి గెలిపించాడు. అసలు ఆస్ట్రేలియాను గెలిపించింది మ్యాక్స్‌వెలా.. ప్రసిద్ కృష్ణనా అని ఓటింగ్‌ పెడితే మనోడికే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది.


ప్రసిద్‌ ఖాతాలో చెత్త రికార్డు:
టీ20లో వికెట్ల తియ్యడంతో పాటు డిసెంట్ ఎకానమి ముఖ్యం. ఎంత పొదుపుగా బౌలింగ్‌ చేశామన్నది ముఖ్యం. ఒకటి రెండు వికెట్లు తీసి భారీగా పరుగులు సమర్పించుకుంటా అంటే కదరదు. మ్యాచ్‌ చేజారిపోతుంది. వికెట్లు పడగొట్టడంతో పాటు ఎకానమీ కూడా డీసెంట్‌గా మెయింటెయిన్‌ చేసే బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. బుమ్రా,భువనేశ్వర్‌ కుమార్‌ అలాంటివారే. అయితే మరో క్యాటగిరి ఉంటుంది. వీళ్లు వికెట్లు తియ్యరు.. ఓవర్‌కు 10కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకుంటారు. ప్రసిద్ కృష్ణ, ఉమ్రాన్‌ మాలిక్‌ అలాంటి క్యాటిగిరికే చెందినవారు.


భారత్‌ తరుఫున కనీసం 20 ఓవర్లు బౌలింగ్‌ వేసి అత్యంత చెత్త ఎకానమి కలిగిన బౌలర్‌గా ప్రసిద్ కృష్ణ నిలిచాడు. అతని ఎకానమి 11గా ఉంది. ఇక ఉమ్రాన్‌ మాలిక్‌ ఎకానమి 10.48గా ఉంది. ఈ ఇద్దరే వరస్ట్‌ ఎకానమీ ఉన్న భారత్‌ టీ20 బౌలర్లు. ఇక బెస్ట్‌ ఎకానమీలో బుమ్రా ఉన్నాడు. అతని ఎకానమి 6.55గా ఉంది. రెండో బెస్ట్‌ ఎకానమి టీమిండియా మాజీ బౌలర్‌ ఆర్పీ సింగ్‌ పేరిట ఉంది.

Also Read: లెఫ్ట్‌ హ్యాండ్‌ సెహ్వాగ్‌ వచ్చాడు.. పక్కకు తప్పుకొండి తమ్ముళ్లూ!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు