భారత్, కెనడా మధ్య ముదురుతున్న వివాదం..కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం విడిచిపోవాలని ఆదేశం..!!

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటనపై భారత్ తీవ్రంగా మండిపడుతోంది. కెనడా హైకమిషనర్ కెమెరూన్ మెక్‌కేను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. కెనడా దౌత్యవేత్తను భారత్ నుంచి బహిష్కరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో ఉన్న కెనడా హైకమిషనర్‌ను పిలిచి ఐదురోజుల్లోగా దేశం విడిచిపోవాలని ఆదేశించారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

New Update
khalistan : భారత ప్రభుత్వానికి కెనడా పీఎం ఝలక్..దౌత్యవేత్త బహిష్కరణ..!!

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా, భారత్ మధ్య వివాదం ముదురుతోంది. కెనడా ప్రధాని భారత్‌కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనకు అదే స్థాయితో భారత్ కూడా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపిస్తూ కెనడా ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది.ఈ తరుణంలోనే కెనడా దౌత్యవేత్తను కూడా ఐదు రోజుల్లో భారత్ ను విడిచివెళ్లాలని ఆదేశించారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

బుధవారం భారత్ కూడా కెనడా ప్రభుత్వానికి తగిన సమాధానం ఇచ్చింది. ప్రధానమంత్రి ట్రూడో ఆరోపణలు నిరాధారమైనవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కెనడాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులు, తీవ్రవాదుల దృష్టిని మరల్చేందుకు ప్రధాని చేసిన ఇటువంటి ప్రకటనలు అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో, బుధవారం ఉదయం భారతదేశం కెనడా హైకమిషనర్ కెమెరూన్ మెక్కేను పిలిపించింది. కెనడా దౌత్యవేత్తను భారత్ నుంచి బహిష్కరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూాడా చదవండి: మిథున్ రెడ్డిVSగల్లా జయదేవ్…మరీ ఇంతలా కొట్టుకోవాలా?

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా మాట్లాడుతూ, "సంబంధిత దౌత్యవేత్తను వచ్చే ఐదు రోజుల్లో భారతదేశం విడిచిపెట్టాలని కోరింది." ఈ నిర్ణయం మన అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్యకలాపాలలో వారి ప్రమేయంపై భారత ప్రభుత్వం యొక్క పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తుంది."కెనడా హైకమిషనర్‌ను బహిష్కరించిన తర్వాత, భారత మాజీ దౌత్యవేత్త రాజీవ్ డోగ్రా మాట్లాడుతూ.. "జస్టిన్ ట్రూడో కొంతకాలంగా ఇబ్బందుల్లో ఉన్నారు. కెనడా ప్రధానమంత్రి పదవిలో ఎక్కువ కాలం కొనసాగలేరనే భయం ఆయనలో ఉంది. అందుకే అతను సమస్యలపై ఇంటి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇది కూాడా చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ ఏమన్నారంటే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు