పబ్జీ గేమ్ లవ్‌స్టోరీ, ఆఖరికి ప్రియుడి కోసం ఇల్లు అమ్మి..? పబ్జీ గేమ్‌లో యూపీ యువకుడితో పాక్ మహిళకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అతడి కోసం పాక్ నుంచి నలుగురు పిల్లలతో కలిసి ఈ ఏడాది మే నెలలో ఆమె ఇండియాకు వచ్చేసింది. ఆమెను జులై 4న పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ మహిళతో సహా యువకుడు సచిన్, అతడి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కానీ, వారు ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.‘పబ్జీ’ప్రేమ కథలో అనేక ఆనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఇద్దరు ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లు తాజాగా వెల్లడయ్యింది. తనను తాను భారతీయురాలిగానే భావిస్తున్నానని, ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె చెప్పడం గమనార్హం. By Shareef Pasha 15 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి కోవిడ్ లాక్డౌన్ సమయంలో యూపీకి చెందిన సచిన్ మీనా , పాకిస్థాన్ సింధు ప్రావిన్సుల్లోని ఖైరాపూర్ జిల్లాకు చెందిన సీమా హైదర్‌లకు పబ్జీలో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఈ పరిచయం స్నేహంగా మారి.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే, సీమాకు అప్పటికే వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. కానీ, ప్రియుడి కోసం ఆమె ఈ ఏడాది మార్చిలో కరాచీ నుంచి బయలుదేరి దుబాయ్ మీదుగా నేపాల్‌కు చేరుకుంది. సచిన్, సీమా మొదటిసారి ప్రత్యక్షంగా నేపాల్‌లోనే కలుసుకున్నారు. అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి ఇరువురూ తమతమ దేశాలకు తిరిగి వచ్చేశారు. అయితే, ఆ రోజు తన ప్రయాణం చాలా కఠినంగా సాగిందని, ఎంతో భయపడ్డానని సీమా గుర్తుచేసుకుంది. అనంతరం.. తన పిల్లలతోసహా భారత్ రావడానికి ఆమె పెద్ద కసరత్తే చేసినట్లు తెలుస్తోంది. నేపాల్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన తర్వాత తన భర్తతో విభేదించి, తన పేరున ఉన్న ఓ ప్లాట్‌ను రూ.12 లక్షలకు అమ్మి డబ్బు సమకూర్చుకుంది. తనతో పాటు తన నలుగురు పిల్లలకు విమాన టిక్కెట్లు, నేపాల్ వీసా ఏర్పాటు చేసుకుంది. ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌పై కేసు నమోదు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా, అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌పై కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఇద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక తాను అధికారికంగా భారత్‌లోనే ఉండిపోయేందుకు అధికారులను సంప్రదిస్తానని సీమా తెలిపారు. ‘వాస్తవానికి.. మమ్మల్ని నెలల తరబడి జైల్లో పెడతారని భావించా. కానీ, బెయిల్ వార్త వినగానే ఆనందంతో కేకలు వేశా. నా భర్త సచిన్ భారతీయుడు.. నేనూ భారతీయురాలిగానే భావిస్తున్నా’ అని ఓ వార్తాసంస్థతో తెలిపింది. పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని, అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంది. అంతేకాదు, తాను హిందువుగా మారి, తన పేరును సీమా సచిన్‌గా మార్చుకున్నట్టు ఆమె తెలిపారు. నా భార్యను తిరిగి పాకిస్థాన్ పంపాలని ప్రధానికి అభ్యర్థన సచిన్ మాట్లాడుతూ.. సీమతో కలిసి ఇంట్లో ఉండటం సంతోషంగా ఉందన్నారు. ‘నా కుటుంబ సభ్యులు సీమను ఆమె పిల్లలతో అంగీకరించారు.. సీమకు భారతీయ పౌరసత్వం ఇవ్వాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీలను అభ్యర్థిస్తున్నాను.. హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహాన్ని నిర్వహించాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చి 13న ఖాట్మండులో వివాహం చేసుకున్నామని, అయితే దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు, సాక్ష్యాలు లేవని తెలిపారు. మరోవైపు, సీమా భర్త గులామ్ హైదర్ మాత్రం భర్త నుంచి విడాకులు తీసుకోకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇస్లాం లేదా హిందూయిజం అనుమతించదు.. నా భార్యను తిరిగి పాకిస్థాన్ పంపాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని వేడుకున్నాడు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి