ప్రపంచ దేశాలకు భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోదీ! ప్రపంచంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచదేశాలకు భారత్ ఓ ఆశాజ్యోతిగా ఉందని మోదీ అన్నారు. బడ్డేట్ సమావేశం అనంతరం ఆయన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో ప్రసంగించారు.భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే రోజు దగ్గరలోనే ఉందని మోదీ తెలిపారు. By Durga Rao 30 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ప్రపంచంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచ దేశాలకు భారత్ ఆశాజ్యోతి అని ప్రధాని మోదీ అన్నారు.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ ఆర్థిక వృద్ధి 8 శాతంతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదు. మేము కోవిడ్ మహమ్మారిని అధిగమించి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాము. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 16 శాతం. ప్రపంచంలో అత్యధిక వృద్ధి ,తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న ఏకైక దేశంగా భారత్ ఉంది. 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తున్నాం. భారతదేశం రోజుకో కొత్త మైలురాయిని చేరుకుంటోంది. బడ్జెట్‌లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు దక్కాయి. గత 10 ఏళ్లలో భారతదేశ బడ్జెట్ కూడా 3 రెట్లు పెరిగి రూ.48 లక్షల కోట్లకు చేరుకుంది. 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు మూలధన వ్యయం రూ.90 వేల కోట్లు. తర్వాత అది 2 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇప్పుడు 5 రెట్లు పెరిగి రూ.11 లక్షల కోట్లకు చేరుకుంది. పన్ను రేట్లు తగ్గించినప్పటికీ, మంత్రిత్వ శాఖలకు కేటాయించే నిధులు పెరిగాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం చేస్తున్న కృషి, చర్యలు అపూర్వమైనవని మోదీ అన్నారు.గత కాంగ్రెస్ హయాంతో పోలిస్తే రైల్వే బడ్జెట్ 8 రెట్లు, హైవే బడ్జెట్ 8 రెట్లు, వ్యవసాయ బడ్జెట్ 4 రెట్లు, రక్షణ బడ్జెట్ 2 రెట్లు పెరిగింది. బీజేపీ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు. మేము నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మరియు సులభమైన జీవనంపై దృష్టి పెడతాము. ప్రస్తుతం భారతదేశంలో 1.40 లక్షల స్టార్టప్‌లు ఉన్నాయి. ముద్రా పథకం కింద 8 కోట్ల మంది రుణాలు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. అభివృద్ధి చెందిన భారతదేశం మనకు చాలా అవసరం. ఈ ప్రయాణంలో దేశం పురోగమిస్తూనే ఉంది. మేము పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశంపై దృష్టి సారించాము. ఇందులో మాకు స్పష్టమైన లక్ష్యం మరియు నిబద్ధత ఉంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్‌కు తరలివస్తున్నారు. ఇండస్ట్రీకి ఇదో సువర్ణావకాశం. దీన్ని మిస్ చేయవద్దు. ప్రధాని మోదీ ఈ విధంగా మాట్లాడారు. #pm-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి