Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. అసలేం జరిగిందంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చారు పూణె పోలీసులు. రోడ్డు విషాలంగా ఉంది కదా అని వేగంగా దూసుకెళ్లిన హిట్ మ్యాన్‌కు ఝలక్ ఇచ్చారు. తన లంబోర్గిని కారుతో అతి వేగంగా ప్రయాణించినందుకు భారీ జరిమానా విధించారు పోలీసులు. By Shiva.K 19 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Rohit Sharma Receives Traffic Challans: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు(Rohit Sharma) బిగ్ షాక్ ఇచ్చారు పూణె పోలీసులు(Pune Police). రోడ్డు విశాలంగా ఉంది కదా అని వేగంగా దూసుకెళ్లిన హిట్ మ్యాన్‌కు ఝలక్ ఇచ్చారు. తన లంబోర్గిని కారుతో అతి వేగంగా ప్రయాణించినందుకు భారీ జరిమానా విధించారు పోలీసులు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో (ICC World Cup 2023) టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయినా.. తరువాత జరిగిన వరుస మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించారు. సెంచరీ, హాఫ్ సెంచరీలోతో ప్రత్యర్థులకు హడలెత్తిస్తున్నాడు. ఆప్ఘనిస్తాన్‌పై 84 బంతుల్లో 131 పరుగులు, ఆస్ట్రేలియాపై 63 బంతుల్లో 86 పరుగులు, పాకిస్తాన్‌పై హాఫ్ సెంచరీతో దుమ్మురేపుతున్నా హిట్ మ్యాచ్. అయితే, అహ్మదాబాద్ వేదికగా జరిగిన పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా రెండు రోజుల క్రితమే అహ్మదాబాద్ నుంచి పూణే చేరుకుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఇవాళ అంటే గురువారం భారత్-బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య మ్యాచ్ జరుగనుంది. Also Read: Fitness Tips : ఉదయాన్నే చేసే ఈ వ్యాయామాలు నడుము కొవ్వును ఐస్‌లా కరిగిస్తాయి..!! Rohit Sharma issued 3 challans for overspeeding at the Mumbai-Pune highway. He was crossing 200kmph while driving. (Pune Mirror). pic.twitter.com/52ghlg7b3m — Mufaddal Vohra (@mufaddal_vohra) October 18, 2023 ఈ నేపథ్యంలో.. రోహిత్ శర్మ తన లంబోర్గిని కారులో ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై దూసుకెళ్లాడు. మామూలు స్పీడ్ కాదండోయ్.. గంటకు 200 నుంచి 215 కిలోమీటర్ల వేగంతో హిట్‌మ్యాన్ రయ్‌మంటూ దూసూకెళ్లాడు. మరి ఖాకీలు ఊరుకుంటారా? తమ డ్యూటీ తాము చేశారు. డేగ కళ్లతో అన్నింటినీ స్కాన్ చేసే ఖాకీలు.. స్పీడ్ గన్‌తో రోహిత్ కారు స్పీడ్‌ను కూడా పట్టేశారు. దాంతో రోహిత్ శర్మకు జరిమానా విధించారు. ఈ కారుపై ఏకంగా మూడు చలాన్లను విధించారు పూణె ట్రాఫిక్ పోలీసులు. కారు వేగంపై ఆందోళన వ్యక్తం చేసిన పోలీసులు.. రోహిత్ ఎస్కార్ట్‌తో జట్టు బస్సులో ప్రయాణించాలని సూచించారు. ఒంటరిగా కారులో ప్రయాణించొద్దని కోరారు. Also Read: Pregnancy Parenting Tips: డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి గర్భిణీలు ఈ ఫుడ్స్ తినాల్సిందే..!! #rohit-sharma #india-vs-bangladesh #rohit-sharma-fined #rohit-sharma-receives-traffic-challans మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి