Independence Day 2024: పంద్రాగస్టు పండగ.. పదకొండోసారి ఎర్రకోట పై జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరికొద్దిసేపట్లో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని న్యూఢిల్లీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. By KVD Varma 15 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Independence Day 2024: బ్రిటీష్ బానిసత్వం నుంచి విముక్తి పొందిన ఆగస్టు 15 భారతీయులకు ప్రత్యేకమైన రోజు. అందుకనుగుణంగానే ఈసారి 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 78వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఎర్రకోట (Red Fort) నుంచి 11వ సారి జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంతో సిద్ధం అయిపోయారు. వీధివీధినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇక ప్రధాని మోదీ పతాకావిష్కరణ చేయనున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతిచోటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కూడా సన్నాహాలు పూర్తి చేశారు. మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీ మెట్రో కూడా రికార్డు నమోదు చేసింది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల ప్రకారం, ఎర్రకోట చుట్టూ ఉన్న అన్ని రహదారులు ఉదయం 4 నుండి క్లోజ్ చేశారు. మళ్ళీ ఉదయం 10 గంటల వరకు వీటిని ఓపెన్ చేస్తారు. దీంతో ఎర్రకోటకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎర్రకోట చుట్టుపక్కల రోడ్లపై ట్రాఫిక్‌పై పూర్తి ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలు ఈ రహదారుల్లోనే.. నేతాజీ సుభాష్ మార్గ్ ఢిల్లీ గేట్ నుండి చట్టా రైల్ వరకు లోథియన్ రోడ్ GPO నుండి చట్టా రైల్ వరకు SP ముఖర్జీ మార్గ్ HC సేన్ మార్గ్ నుండి యమునా బజార్ చౌక్ వరకు చాందినీ చౌక్ రోడ్ ఫౌంటెన్ చౌక్ నుండి ఎర్రకోట నిషాద్ రాజ్ మార్గ్ రింగ్ రోడ్ నుండి నేతాజీ సుభాష్ మార్గ్ వరకు ఎస్ప్లానేడ్ రోడ్, దాని లింక్ రోడ్ నేతాజీ సుభాష్ మార్గ్ రాజ్‌ఘాట్ నుండి ISBT వరకు రింగ్ రోడ్, ISBT నుండి IP ఫ్లైఓవర్ వరకు ఔటర్ రింగ్ రోడ్ (సలీంఘర్ బైపాస్) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 4 గంటలకు డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 6 గంటల వరకు అన్ని లైన్లలో ప్రతి 15 నిమిషాలకు మెట్రో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఆగస్టు 13న ఢిల్లీ మెట్రో రైడర్‌షిప్ రికార్డు సృష్టించింది. మంగళవారం 72.38 లక్షల మంది ప్రయాణించారు. ఇది ఒక రోజులో ప్రయాణికుల సంఖ్య రికార్డు. ఆగస్టు 13, 2024: 72 లక్షల 38 వేల 271 ఫిబ్రవరి 13, 20 24: 71 లక్షల 9 వేల 938 ఆగస్టు 12, 2024: 71 లక్షల 7 వేల 642 సెప్టెంబర్ 4, 2023: 71 లక్షల 4 వేల 338 ఫిబ్రవరి 12, 2024: 70 లక్షల 88 వేల 202 పదకొండోసారి జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ.. ఎర్రకోట నుంచి జెండా ఎగరేయడం విషయంలో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు, ఇందిరా గాంధీ తర్వాత ప్రధాని మోదీ మూడో స్థానానికి చేరుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై నుంచి 17 సార్లు(1947 నుంచి 1964 వరకు ) , ఇందిరా గాంధీ 16 సార్లు(1966 నుంచి 1977 ఆ తరువాత 1980 నుంచి 1984 వరకు ) త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఎర్రకోటలో ప్రధానమంత్రి కార్యక్రమ షెడ్యూల్ ఇదే.. ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 7:17 గంటలకు ఎర్రకోట చేరుకుంటారు. సాయంత్రం 7:19 గంటలకు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వబడుతుంది. PM రాత్రి 7:28 గంటలకు ఎర్రకోట ప్రాకారానికి చేరుకుంటారు. 7:30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాత్రి 7:33 గంటలకు దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సందేశం. ప్రధానమంత్రి ప్రసంగంలో ఈ అంశాలు ఉండవచ్చు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో ప్రధాని మోదీ 'అభివృద్ధి చెందిన భారతదేశం' అనే అంశంపై మాట్లాడవచ్చు. బంగ్లాదేశ్ పరిస్థితి పై కూడా మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసే అంశంపై ఆయన ఫోకస్ చేయవచ్చు. అలాగే మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రజలిచ్చిన అవకాశంపై ప్రధాని ప్రస్తావించవచ్చు. ఈ అంశాలన్నింటితో పాటు, గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం సాధించిన పథకాలు - విజయాలపై కూడా PM మాట్లాడవచ్చు. ప్రధానమంత్రి ఏదైనా కొత్త పథకం లేదా విధానం ప్రకటిస్తారా లేదా ప్రస్తుతం ఉన్న సంక్షేమ కార్యక్రమాల పరిధిని విస్తరిస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దీనితో పాటు ప్రధాని తన ప్రసంగంలో జమ్మూ కాశ్మీర్‌పై కూడా మాట్లాడవచ్చు. గత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని తన ప్రసంగాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2019లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి, ఈ అంశం కూడా ప్రధానమంత్రి ప్రసంగంలో భాగం కావచ్చు. #pm-modi #red-fort #august-15 #independence-day-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి