Ind Vs Sl: రెండో వన్డేలో తడబడిన భారత్.. తప్పని పరాభవం! శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయంపాలైంది. శ్రీలంక నిర్దేశించిన 240 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 208 పరుగులకు ఆలౌటైంది. ఆగస్టు 7న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఇందులో భారత్ గెలిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది. By srinivas 04 Aug 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Ind Vs Sl: శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమ్ ఇండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక వెటరన్ స్పిన్నర్ జెఫ్రి వాండర్సే (6/33) భారత్ పతనాన్ని శాసించాడు. 🚨 Wanindu Hasaranga will miss the remainder of the ODI series, as the player has suffered an injury to his left hamstring. 🚨 He experienced pain in his left hamstring while delivering the last ball of his 10th over during the first ODI. An MRI performed on the player,… pic.twitter.com/BWcv6l4k3a — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 3, 2024 ఇక టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కినా అనుహ్యంగా వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (35; 44 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (44; 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. ఆగస్టు 7న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఇందులో భారత్ గెలిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది. ఇక శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో (40; 62 బంతుల్లో 5 ఫోర్లు), కుశాల్ మెండిస్ (30; 42 బంతుల్లో 3 ఫోర్లు), దునిత్ వెల్లలాగె (39; 35 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), కమిందు మెండిస్ (40; 44 బంతుల్లో 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. #ind-vs-sl #india-lost మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి