Ginger Tea: కాలం ఏదైనా నిత్యం ఓ అల్లం టీ తాగితే చాలు! నిత్యం అల్లం టీ ని తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె సమస్యలు తగ్గడంతో పాటు, అధిక బరువును తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. By Bhavana 15 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Ginger Tea: చాలా మందికి ప్రతిరోజు వేడి వేడి తేనీరు గొంతులో పడితే కానీ ఏ పని చేయలేరు. కొందరు అయితే టీ తాగితే కానీ ఉత్సాహంగా పని చేయలేరు. అలాంటి టీ కి అల్లం జోడిస్తే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. అల్లంలో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ బాడీకి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా అల్లం టీ వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ప్రయాణాలు చేసేవారికి చాలా మందికి కడుపు తిప్పుతుంది. అంతేకాకుండా కొంత మందికి బస్సు ప్రయాణాలు పడవు. వాంతులు అవుతుంటాయి. అలాంటి వారికి అల్లం టీ ఇస్తే ఉపశమనం కలుగుతుంది. మహిళలు నెలసరి సమయంలో ఎదుర్కొనే సమస్యలకు అల్లం టీ మంచి ఔషధం. Also read: అద్దె ఇంటి నుంచి లక్షల కోట్లు వరకు.. బిజినెస్ టూ బాలీవుడ్ వరకు.. సుబ్రతారాయ్ సక్సెస్, ఫెయిల్యూర్ స్టోరీలివే..!! కడుపు ఉబ్బరం, గ్యాస్ లేన్పులు, జీర్ణ సమస్యలతో (Digestion) బాధపడేవారికి అల్లం టీ చాలా మంచిది. దీనిని రోజూ అల్లం టీ తాగితే మరీ మంచిది. 40 సంవత్సరాలు దాటిన వారికి నిత్యం వేధించే సమస్య నడుము నొప్పి, కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారు అల్లం టీ తాగడం చాలా మంచిది. మెరుగైన రక్త ప్రసరణకు అల్లం టీ బాగా పని చేస్తుంది. జలుబు, జ్వరం (Fever) ఉన్నవారు కచ్చితంగా అల్లం టీ తాగాలి. అల్లం టీ రోగనిరోధక శక్తిని (Immunity) పెంపొందిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం కూడా అల్లం టీని తీసుకోవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (Cholesterol) ని దూరం చేసి గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది. సీజనల్ వ్యాధులకు అల్లం టీతో చెక్ పెట్టవచ్చు. అధిక బరువుని తగ్గించే శక్తి కూడా అల్లం టీకి ఉంది. అంతేకాకుండా రోజుకు రెండేసి కప్పుల అల్లం టీ తాగితే శ్వాసకోశం పనితీరు మెరుగవుతుంది. బీపీ కూడా బాగా తగ్గుతుంది. అల్లం టైప్ 2 డయాబెటీస్ వ్యాధి ఉన్న వారికి షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. అల్లం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.అల్లంలోని జింజిబర్ అనే పదార్థం హానికర బ్యాక్టీరియాని తొలగించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగని అతిగా కూడా తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఎన్నో అనర్థాలు జరిగే అవకాశాలున్నాయి. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంటతో పాటు చికాకు కలిగిస్తుంది. అందుకే తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. #lifestyle #ginger-tea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి