Train: ఏసీ బోగీలో సూట్ కేసులు కొరికేసిన ఎలుకలు.. బాధితుడు ఏం చేశాడంటే..? కోల్ కతా–ముంబై జ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఏసీ బోగీలో ఎలుకలు సూట్ కేసులు కొరికేశాయి. దీంతో ఓ బాధితుడు తనకు జరిగిన నష్టాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నాడు. ఈ ఘటనపై స్పందించిన రైల్వే శాఖ.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. By Jyoshna Sappogula 22 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Train: కోల్ కతా నుంచి ముంబైకి వెళ్లే జ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ లో గత శనివారం ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఏసీ బోగీలో ఎలుకలు సూట్ కేసులు కొరికేశాయి. దీంతో ఓ బాధితుడు రైల్వే శాఖ తీరుపై మండిపడ్డాడు. ఎలుకలు తన సూట్ కేసులు ఎలా కొరికాయో చూడండంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోను పోస్ట్ చేశాడు. Also Read: వరంగల్ – ఎంజీఎం ఆసుపత్రిలో కరెంట్ కట్.. అవస్థలు పడ్డ రోగుల ..! దీనిపై ఫిర్యాదు చేసేందుకు అర గంట నుంచి టీసీ కోసం ఎదురుచూస్తున్నా అంటూ పేర్కొన్నాడు. ఈ ఘటనపై రైల్వే శాఖ స్పందించింది. ఈ విషయం చాలా ఆందోళన కలిగిస్తోందని.. మీకు వీలైనంత వెంటనే సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. @RailMinIndia @RailwaySeva @Central_Railway @PMOIndia Train 12102 Departed on 19th May Coach H1 Seat A-2. PNR 6535087042. Suitcases damaged by rodents. Trying to the TC for half hour to lodge complaint. pic.twitter.com/EfeX39EYI4 — ✨CG✨ (@CG_bharatiya) May 21, 2024 #railway మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి