Leopard: చిరుత సంచారంతో బెంబెలెత్తుతున్న గంగారం గ్రామ వాసులు ! మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారంలో చిరుత సంచారం గ్రామవాసులను కలవర పెడుతోంది. కొన్ని నెలల క్రితం ఇదే గ్రామంలో మేకలు,ఆవులపై చిరుత దాడి చేసి చంపిన ఘటనలు జరిగాయి. ఇప్పుడు గ్రామశివార్లలో చిరుత సంచరిస్తుందని ప్రజలకు తెలియటంతో వారు బెంబెలెత్తి పోతున్నారు. By Durga Rao 22 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Mahbubnagar: మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం అటవీ ప్రాంత పరిశరాలలో ఇటీవలె చిరుత (Leopard) సంచారంతో అక్కడి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఏప్రిల్ లో ఇదే గ్రామ సరిహద్దు గ్రామాలలో మేకలు, లేగ దూడల పై చిరుత దాడి చేసింది. గంగారం అటవీ ప్రాంతం సుమారు 2,600కిలో మీటర్లు విస్తిరించి ఉంది.ఈ అడవిలో జింకలు అధికంగా ఉన్నాయి. చిరుతల సంచారంతో వ్యవసాయ పొలాలకు కూడా వెళ్లేందుకు రైతులు భయపడుతున్నామని రైతులు వాపోతున్నారు చిరుతల సంచారంపై ఫారెస్ట్ రేంజ్ అధికారి ఫర్వేజ్ అహ్మద్ స్పందించారు. చిరుతలు ఆహారం కోసం అడవిలోకి వచ్చాయని, గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లవద్దని, అయితే అటవీ జంతువులకు ఎటువంటి హాని చేయవద్దని సూచించారు.చిరుతలు గ్రామంలో రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వారు తెలిపారు. Also Read: జై బాలయ్య.. ‘బాలు గాని టాకీస్’ ఫస్ట్ లుక్..! #telangana-news #mahbubnagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి