టీటీడీ మాదిరిగా దుర్గు గుడికి ఎస్టీఎంబీసీ ఛానల్... పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు...!

దుర్గగుడి పాలకమండలి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. సమావేశంలో పలు కీలక తీర్మానాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. శివాలయంలో రూ.40 లక్షల అంచనాతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
టీటీడీ మాదిరిగా దుర్గు గుడికి ఎస్టీఎంబీసీ ఛానల్... పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు...!

దుర్గగుడి పాలకమండలి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. సమావేశంలో పలు కీలక తీర్మానాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. శివాలయంలో రూ.40 లక్షల అంచనాతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తామన్నారు.

వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ వాహనాలతో పాటు రెండు డీజిల్ వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. పసిపిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం కల్పించాలని నిర్ణయించామన్నారు. దూర ప్రాంత భక్తుల కోసం మహామండపం మొదటి అంతస్తులో డార్మిటరీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నామమాత్రపు రుసుముతో డార్మిటరీలో బసకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఫ్లై ఓవర్ మీద వెళ్లే భక్తులకు కనిపించేలా అమ్మవారి చిత్రాలు ఏర్పాటుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. బంగారు ఆభరణాల దాతలకు అందుబాటులో వుండేలా గోల్డ్ అప్రైజర్ ను నియమించాలని నిర్ణయించామన్నారు. అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్న నూతన జంటకు మ్యారేజ్ టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అమ్మవారి స్థల పురాణం పై డాక్యుమెంటరీ రూపొందించే ప్రతిపాదనకు పాలక మండలి ఆమోద ముద్ర వేసిందన్నారు.

దుర్గా ఘాట్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. అమ్మవారి సేవలను సోషల్ మీడియా, యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. అమ్మవారి సేవలకు ప్రచారం కల్పించేందుకు ఏపీ ఫైబర్ నెట్ కూడా అంగీకారం తెలిపిందన్నారు. టీటీడీ ఎస్వీబీసీ మాదిరిగా దుర్గగుడికి ఎస్డీఎంబీసీ ఛానల్ అందుబాటులోకి తెస్తామన్నారు.

అమ్మవారి కుంకుమ ప్రసాదం ప్రతీ భక్తుడికి ఇచ్చే కార్యక్రమాన్ని పౌర్ణమి రోజన ప్రారంభిస్తామన్నారు. రెండు వేల మంది ఒకేసారి అన్న ప్రసాదం స్వీకరించేలా అన్నదాన భవన్ ను విస్తరిస్తున్నామని వివరించారు. రాబోయే నెల రోజుల్లో అన్నదాన భవన్‌కు శంకుస్థాపన చేస్తామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!

ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి ఆయన వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు.

New Update

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. రేపు సిట్‌ విచారణకు వస్తానని ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హాయంలో ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఈ మేరకు సిట్ కూడా ఏర్పాటు చేసింది. కొంత మందికి లబ్ధి చేకూరేలా లిక్కర్ పాలసీ, ట్రాన్స్ పోర్ట్, టెండర్లలో మార్పులు చేసినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. దాదాపుగా రూ. 18,860 కోట్లు అక్రమాలు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.

కసిరెడ్డిదే కీలక పాత్ర..

ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు నిర్దారణకు వచ్చిన సిట్.. ఇప్పటికే ఆయనకు పలు మార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన స్పందించలేదు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో సిట్ విచారణకు హాజరు కావాలని డిసైడ్ అయిన కసిరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఓ ఆడియో విడుదల చేశారు. రేపటి సిట్ విచారణకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. 

అయితే.. దుబాయ్ నుంచి రాజ్ కసిరెడ్డి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు. అయితే.. ఆయనను పలు అంశాలపై విచారించి రేపు సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజ్ కసిరెడ్డి విచారణలో ఎవరి పేర్లు బయట పెడతారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

(telugu-news | telugu breaking news | latest-telugu-news | ap liquor scam)

Advertisment
Advertisment
Advertisment