Dussera 2023: దసరా రోజు జమ్మి చెట్టుని ఎందుకు పూజిస్తారు...పాలపిట్టను ఎందుకు చూడాలి! విజయాలు సిద్ధించిన రోజు జరుపుకునే పండుగ రోజున దేవతా వృక్షమైన జమ్మి చెట్టును పూజించటం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ చెట్టును శమీ వృక్షం అని కూడా పిలుస్తారు. కేవలం పండుగ రోజే కాదు.జమ్మి చెట్టును వివాహాలు , గృహాప్రవేశాల సమయంలో కూడా పూజిస్తారు. By Bhavana 22 Oct 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి విజయ దశమి...చెడు పై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగ. లోకాన్ని రక్షించే అమ్మవారు 9 రోజులు పాటు రాక్షసులతో వివిధ రూపాల్లో పోరాడి గెలిచిన సందర్భంగా అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు కూడా వివిధ రూపాల్లో కొలుస్తారు. ఇలాంటి ఎంతో ముఖ్యమైన ఈ పండుగలో జమ్మి చెట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. విజయాలు సిద్ధించిన రోజు జరుపుకునే పండుగ రోజు విజయదశమి నాడు దేవతా వృక్షమైన జమ్మి చెట్టును పూజించటం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ చెట్టును శమీ వృక్షం అని కూడా పిలుస్తారు. కేవలం పండుగ రోజే కాదు.జమ్మి చెట్టును వివాహాలు , గృహప్రవేశాల సమయంలో కూడా పూజిస్తారు. ఈ జమ్మిచెట్టు గురించి పురాణాల్లో ఓ కథ ఉంది. అది ఏంటంటే కౌరవులు, పాండవులు పాచికలు ఆడి రాజ్యంతో పాటు సర్వం కోల్పోయి అరణ్యవాసం చేసిన తరువాత అజ్ఙాత వాసం కూడా చేయాలనే నియమం ఉంటుంది. ఆ సమయంలో వారి ఆయుధాలతో పాటు వస్త్రాలను కూడా జమ్మి చెట్టు మీద దాచిపెడతారు. అజ్ఙాతవాసం పూర్తి కాగానే వాటిని జమ్మి చెట్టు పై నుంచి కిందకి తీసుకుని చెట్టును అపరాజిత దేవి రూపంగా పూజించి ఆశీస్సులు పొందిన తరువాత వారు విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇది ఒక కథ అయితే..త్రేతా యుగంలో శ్రీరాముడు కూడా రావణునితో యుద్దానికి వెళ్లే ముందు శమీ వృక్షానికి పూజించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. దసరా పండుగ సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుతూ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు శమీ వృక్షం కూడా ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా జమ్మి చెట్టుని అగ్నిని పుట్టించే వృక్షంగా కొలుస్తారు. ఈ చెట్టు నీరు లేని చోట కూడా ఏపుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో ఆయుర్వేద గుణాలను కలిగి ఉన్న చెట్టు కూడా. చెట్టు నుంచి ప్రతి భాగాన్ని వినియోగిస్తారు. దసరా పండుగ రోజున పాలపిట్టను చూడాలనే ఓ నమ్మకం కూడా ఉంది. పాండవులు జమ్మి చెట్టు మీద నుంచి ఆయుధాలు తీసుకుని తిరిగి వస్తుండగా వారికి పాలపిట్ట కనిపించిందని అందుకే వారు యుద్దం లో విజయం సాధించారని అంతే కాకుండా అప్పటి నుంచి కూడా వారు అన్నింట్లోనూ విజయం సాధించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పాలపిట్టను విజయ దశమి నాడు చూడటం చాలా శుభసూచకంగా చెప్పుకొవచ్చు. దసరా రోజున పాలపిట్ట కచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. దసరా రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని తెలుగు ప్రజల నమ్మకం. తెలుగు ప్రజలు చేపట్టిన ప్రతి పనిలో, నమ్మకంలో విజయం అవుతుందని ప్రజలు నమ్ముతారు. Also read: డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మాటల మాంత్రికుని తనయుడు! #dussera-2023 #jammi-chettu #palapitta మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి