Winter: ఈసారి చలికాలం ఎలా ఉంటుందో తెలుసా..?

దేశంలో అత్యధిక ప్రాంతాల్లో డిసెంబర్‌లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగానే ఉంటాయని భారత వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది.

New Update
Winter: ఈసారి చలికాలం ఎలా ఉంటుందో తెలుసా..?

చలికాలం మొదలైపోయింది. డిసెంబర్‌ మొదటివారానికి వచ్చినా చలి తీవ్రత ఎక్కువగా కనిపించడం లేదు. గత ఏడాది ఇదే సమయానికి చలితో వణికిపోయేవాళ్లం. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇందుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. దేశంలో అత్యధిక ప్రాంతాల్లో డిసెంబర్‌లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని అంచనా వేస్తోంది. అయితే ఉత్తర, వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని తెలిపారు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇందుకు భిన్నంగా పరిస్థితులు ఉండే అవకాశాలున్నాయని తెలిపారు. అలాగే సగటు వర్షపాతం కూడా సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని వివరించారు.

Also read: సాగర్ వివాదానికి కారణం కృష్ణా బోర్డు వైఫల్యమే.. ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి లేఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు