Rains: మరో 4 రోజులు కుండపోతే.. తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్..! తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతం అల్పపీడనం కారణంగా ఏపీలోనూ మరో మూడు రోజుల పాటు వానలు పడనున్నాయని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. By Jyoshna Sappogula 25 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Rains: తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో తెలంగాణలో విస్తారంగా వానలు పడనున్నాయన్నారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్‌లో కుండపోత పడనుంది. గంటకు 30-40 కి.మి వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఉదయం నుండి వాన పడుతునే ఉంది. రహదారులన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలపి సూచిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌నూ వర్షాలు వదలడం లేదు. మరో మూడురోజుల పాటు వానలు పడనున్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్న కారణంగా వర్షాలు పడుతున్నాయని తెలిపారు. ఈ నెల 26 లేదా 27వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. #rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి