Amaravati : అమరావతిలో పర్యటించనున్న ఐఐటీ మద్రాస్‌ బృందం

AP: రాజధాని అమరావతిలో ఈరోజు ఐఐటీ మద్రాస్‌ నిపుణుల బృందం పర్యటించనుంది. సెక్రటేరియట్‌, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటీ హైదరాబాద్‌ బృందం పరిశీలించిన సంగతి తెలిసిందే.

New Update
Amaravati : అమరావతిలో పర్యటించనున్న ఐఐటీ మద్రాస్‌ బృందం

IIT Madras Team To Visit Amaravati : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravati) లో ఈరోజు ఐఐటీ మద్రాస్‌ నిపుణుల బృందం (IIT Madras Team) పర్యటించనుంది. సెక్రటేరియట్‌, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు. గత టీడీపీ (TDP) ప్రభుత్వంలోనే ఐకానిక్‌ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తి అయింది. ఈ ఐదేళ్లు పట్టించుకోక సెక్రటేరియట్‌ ప్రధాన టవర్ల పునాదులు నీటిలో నానుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటీ హైదరాబాద్‌ బృందం పరిశీలించింది. అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి రెండు బృందాలు నివేదిక అందించనున్నాయి.

టైం పడుతుంది: ఐఐటీ హైదరాబాద్ బృందం

నిన్న ఏపీ రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలించింది. నిర్మాణాల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు ఐఐటీ ప్రొఫెసర్‌లు సుబ్రహ్మణ్యం, మున్వర్ భాషా. భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని అన్నారు. భవనాల ప్రస్తుత స్థితి, నిలిచి ఉన్న వర్షపు నీటి ప్రభావం, నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పారు. 

సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం అని అన్నారు. ప్రతీ అంశాన్ని కూలంకుషంగా పరిశీలించి తదుపరి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. నిర్మితమైన భవనాల వద్ద టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం అని తెలిపారు. సామాగ్రిని కూడా పరీక్ష చేయాల్సి ఉందని చెప్పారు. నివేదికకు ఎంత కాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం అని అన్నారు. సాధ్యమైనంత త్వరగానే సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని తెలిపారు.

Also Read : పెట్టుబడులే లక్ష్యం.. ఈరోజు అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
తాజా కథనాలు