ఈ 'రహస్యం' తెలిస్తే మీ మొబైల్ ఎప్పటికీ పాడైపోదు!

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. అయితే ఫోన్‌లో పవర్ ఆఫ్, పవన్ ఆన్‌ చేయడానికి మనకు రెండు ఆఫ్షన్స్‌ ఉంటాయని తెలుసు కదా.. మరి వీటిలో రిస్టార్ట్ చేయడం మంచిదా లేక స్విచ్చా్ఫ్ చేసి, ఆన్ చేయడం మంచిదా.. ఏది ఫోన్‌కు మంచిదో చూద్దాం..

New Update
ఈ 'రహస్యం' తెలిస్తే మీ మొబైల్ ఎప్పటికీ పాడైపోదు!

నేడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండటం సర్వసాధారణమైపోయింది. స్కూల్ పిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా అందరి వద్ద స్మార్ట్  ఫోన్ వాడకం నిరంతరం పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు పెద్ద, చిన్న అన్ని రకాల పనులను దానిపైనే చేస్తున్నారు. ఫోన్ కొత్తది అయితే చాలా సరదాగా ఉంటుంది, కానీ అది పాతబడటం మొదలయ్యే కొద్దీ అందులో రకరకాల సమస్యలు మొదలవుతాయి. చాలా సార్లు, ఫోన్ ల్యాగ్ అవ్వడం వల్ల ఫోన్‌లో కొత్త సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. దీంతో మనం వెంటనే ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తాము. తద్వారా మనం దాన్ని మళ్లీ ఆన్ చేసినప్పుడు, ఫోన్ సరిగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఫోన్‌లో పవర్ ఆఫ్, రీస్టార్ట్ ఆప్షన్‌లు రెండూ ఉంటాయి.

అయితే మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం వల్ల కనెక్టివిటీ సమస్యలు రావోచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌లు కొన్నిసార్లు డేటా, Wi-Fiకి కనెక్ట్ కాలేవు, ఫోన్‌ని పునఃప్రారంభించిన తర్వాత మళ్లీ కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక మీ ఫోన్‌ని పవర్ ఆఫ్ చేయడం వల్ల దాని కాచే డేటాను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. దీంతో మీ ఫోన్ మరింత సమర్థవంతంగా పని చేస్తుంది.

ఫోన్‌ను షట్ డౌన్ చేయడం, రీస్టార్ట్ చేయడం కాకుండా, మీరు ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లను క్లియర్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరి మరింత కాలం ఉంటుంది.

ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం అనేది సాధారణంగా ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు, లేదా యాప్‌లు సరిగ్గా రన్ కానప్పుడు, సాఫ్ట్‌వేర్ లోపాలు ఏర్పడినప్పుడు చేయాలి. ఇలా ఫోన్ సరిగ్గా పనిచేయడంలో తొడ్పాటును ఇస్తుంది. ఇది మంచి పద్ధతి కూడా, దీని కారణంగా ఫోన్ సాఫీగా నడుస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు