Alcohol Effects: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. మద్యం వెంటనే మానేయండి! పాత కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా పెగ్గు వెయ్యడం మాత్రం కామన్. అయితే, ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తే అది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. కొన్ని లక్షణాలు మనలో కనిపించినప్పుడే మద్యం మానేయాలని వైద్యులు నిపుణులు అంటున్నారు. By V.J Reddy 18 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి * ఉబ్బరం: మీరు ప్రతిరోజూ ఉబ్బరంతో బాధపడుతుంటే, మద్యం సేవించడం దీనికి ప్రధాన కారణం కావచ్చు. ఎందుకంటే ఆల్కహాల్ జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కడుపులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా దెబ్బతింటుంది. * అనారోగ్యంగా ఉండడం: ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే అనారోగ్యంగా అనిపిస్తే అది మద్యం వల్ల కావచ్చు. రోగనిరోధక వ్యవస్థపై ఆల్కహాల్ భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఆల్కహాల్ తరచుగా తీసుకోవడం వల్ల మీ రక్తంలో వ్యాధి-పోరాట కణాల సంఖ్య తగ్గిపోతుందని అధ్యయనాలు నిర్ధారించాయి. * నిద్ర పట్టకపోవడం: మద్యం తాగకపోతే నిద్రపట్టదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే, మద్యం కూడా నిద్ర సమస్యలను కలిగిస్తుంది. ఆల్కహాల్ వల్ల ఎక్కువ సేపు నిద్ర పట్టదు. మీరు పగటిపూట నిద్రించడానికి ఇబ్బంది పడుతుంటే, మద్యపానం మానేయడానికి ఇది సమయం అని మీరు తెలుసుకోవచ్చు. * చర్మ వ్యాధులు: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చర్మంపై మద్యం ప్రభావాలు ఎక్కువగా ఉంటాయట. చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల చర్మం మరింత సున్నితంగా మారుతుంది. అప్పుడు దురద వంటి సమస్య కనిపించవచ్చు. చర్మం పొడిగా మారవచ్చు. చర్మ సమస్య కనిపిస్తే, మద్యం సేవించడం మానేయడం మంచిది. * పంటి సమస్య: మద్యం అధికంగా తీసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్లలో సమస్య కనిపిస్తుంది. ఆల్కహాల్ కంటెంట్ దంతాల ఎనామెల్‌పై దాడి చేసి దానిని నాశనం చేస్తుంది. దీంతో దంతాలు, చిగుళ్లు బలహీనపడతాయి. #best-health-tips #alcohol-effects #drinking-alcohol మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి