Somanath: అదే జరిగితే చంద్రయాన్ నాశనమైనట్టే..... బాంబు పేల్చిన ఇస్రో చైర్మన్...!

ఇస్రో చీఫ్ సోమనాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లకు ముప్పు పొంచి వుందన్నారు. చంద్రునిపై వాతావరణం లేకపోవడం వల్ల ఖగోళ వస్తువులు ఎటు నుంచి వచ్చి ఢీ కొడతాయో తెలియదన్నారు. ఒక వేళ ఏదైనా ఖగోళ వస్తువు వచ్చి ఢీ కొడితే ల్యాండర్, రోవర్లు ధ్వంసమైపోతాయన్నారు. అదే జరిగితే చంద్రయాన్-3 నాశనమైనట్టేనన్నారు.

author-image
By G Ramu
New Update
Somanath: అదే జరిగితే చంద్రయాన్ నాశనమైనట్టే..... బాంబు పేల్చిన ఇస్రో చైర్మన్...!

Somanath shoking comments on Chandrayan-3: విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) సాఫ్ట్ ల్యాండ్ కావడంతో చంద్రయాన్-3 సక్సెస్ అయినట్టేనని అంతా అనుకుంటున్నారు. అతి పెద్ద విజయాన్ని తలుచుకుంటూ భారతీయలంతా సంబురాల్లో తేలియాడుతున్నారు. ఇలాంటి క్రమంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ పెద్ద బాంబు పేల్చారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లకు ఓ పెద్ద ప్రమాదం పొంచి వుందన్నారు. దీంతో అంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు.

ల్యాండర్, రోవర్లకు పొంచి వున్న ప్రమాదం

చంద్రునిపై వాతావరణం లేకపోవడం వల్ల విక్రమల్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లకు (Pragnan Rover) పలు రకాల ప్రమాదాలు పొంచి వున్నాయని చెప్పారు. చంద్రునిపై వాతావరణం లేకపోవడం వల్ల ఎటు నుంచి ఏ ఖగోళ వస్తువులు వచ్చి పడతాయో తెలియదన్నారు. చంద్రున్ని ఇప్పటి వరకు ఎన్నో ఖగోళ వస్తువులు వచ్చి ఢీ కొట్టాయన్నారు. వాటికి సంబంధించిన గుర్తులు చంద్రునిపై ఉన్నాయన్నారు.

అదే జరిగితే చంద్రయాన్-3 నాశనం అవుతుంది

అలా ఏవైనా ఖగోళ వస్తువులు అత్యంత వేగంగా వచ్చి బలంగా ఢీ కొడితే ల్యాండర్, రోవర్లు పూర్తిగా ధ్వంసమైపోతాయన్నారు. అదే జరిగితే చంద్రయాన్-3 మిషన్ పూర్తిగా నాశనమైపోతుందన్నారు. వాటితో పాటు చంద్రునిపై ఉష్ణ సమస్య, ఉంటుందన్నారు. అక్కడ వున్న పరిస్థితుల వల్ల అప్పుడప్పుడు కమ్యూనికేషన్ నిలిచి పోవడం వంటివి జరుగుతాయన్నారు.

Also Read: చంద్రయాన్-3 ఫొటో తీసిన చంద్రయాన్-2…వాట్ ఏ మిరాకిల్ బ్రో..!!

ప్రస్తుతానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు

భూమిపై కూడా ప్రతి గంటకు లక్షల కొద్ది ఖగోళ వస్తువులు వస్తుంటాయన్నారు. కానీ మన భూమిపై ఉన్న వాతావరణం వల్ల ఆ వస్తువులన్నీ కాలి పోతుంటాయన్నారు. అందుకే వాటిని మనం గుర్తించలేకపోవచ్చన్నారు. ప్రస్తుతానికి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదన్నారు. ల్యాండర్, రోవర్లు ఇప్పటి వరకు అన్నుకుట్టుగానే తమ పనిని నిర్వహిస్తున్నాయన్నారు.

చంద్రయాన్-3 మిషన్ లోని విక్రమ్ ల్యాండర్ బుధవారం చంద్రునిపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. దీంతో దక్షిణ ద్రువంపై అడుగు పెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇస్రో సాధించిన ఘనతపై భారతీయులంతా గర్వ పడుతున్నారు. దేశం సాధించిన ఈ అద్బుతమైన విజయాన్ని ఆనందిస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. ఇస్రో మరిన్ని విజయాలను సాధించాలని అంతా కోరుకుంటున్నారు.

Also Read: వావ్…జాబిల్లిపై వడివడిగా అడుగులు వేస్తోన్న రోవర్, వీడియో వైరల్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు