PM Modi: ఒకవేళ అలా చేస్తే అవే నా చివరి ఎన్నికలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు హిందూ, ముస్లింల మధ్య విభేదాలు తెచ్చి రాజకీయ లబ్ది పొందాలని తాను, బీజేపీ చూస్తున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు మోదీ. ఒకవేళ మతాల పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయన్నారు. తాను ఎప్పుడు అలా చేయాలని అనుకోనని తెలిపారు. By V.J Reddy 15 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi: 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందేందుకు హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు రేకెత్తిస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సోమవారం వారణాసిలో నామినేషన్ వేసిన ఆయన అనంతరం ప్రముఖ ఇంగ్లీష్ మీడియాకుతో మాట్లాడుతూ.. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. హిందూ, ముస్లింల మధ్య విభేదాలు తెచ్చి ఓట్లు రాబట్టాలనే ఆలోచన తనకు ఎప్పుడు లేదని పేర్కొన్నారు. ఒకవేళ హిందూ ముస్లిం అని చెప్పి రాజకీయాలు చేస్తే అవే నాకు చివరి ఎన్నికలని అన్నారు. రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టాలని తాను అనుకోనని తేల్చి చెప్పారు. దేశ శాంతి భద్రతలకు ముప్పు కలిగించే పనులు తాను ఎప్పుడు చేయనని వివరించారు. ALSO READ: రాహుల్, సోనియా గాంధీ దేశాన్ని విడిచిపోతారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో దేశ ప్రజలు తనవైపు ఉన్నారని.. తనకు ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు మోదీ. ఎన్నికల ప్రచారంలో తాను ముస్లింల గురించి మాత్రమే మాట్లాడలేదని, ప్రతి పేద కుటుంబం గురించి మాట్లాడినట్లు తెలిపారు. అలాగే.. ముస్లిం అంటే “చొరబాటుదారుల", "ఎక్కువ పిల్లలు ఉన్నవారు" అనే వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. మోదీ మాట్లాడుతూ .. "నేను షాక్ అయ్యాను, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారి గురించి మాట్లాడినప్పుడల్లా, వారు ముస్లింలు అని ఎవరు చెప్పారు? మీరు ముస్లింల పట్ల ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? పేద కుటుంబాలలో కూడా ఇదే పరిస్థితి. పేదరికం ఉన్న చోట, ఎక్కువ మంది ఉన్నారు. పిల్లలు, వారి సామాజిక వృత్తంతో సంబంధం లేకుండా నేను చెప్పాను, ముస్లిం - హిందువులని నేను ఎక్కడ చెప్పలేదు. మీకు స్థోమత ఎంత ఉందొ అంతే మందిని కనండి.. మీ పిల్లలను ప్రభుత్వమే చూసుకోవాల్సిన పరిస్థితి రావద్దు’’ అని అన్నారు. కాగా.. ప్రధాని మోదికి, భారతీయ జనతా పార్టీ తమ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మైనారిటీ ముస్లింలను లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడికి దిగుతుందని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్షలు చేస్తున్న ఆరోపణలపై మోదీ, బీజేపీ ఖండించాయి. #pm-modi #lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి