Polling Officer Isha Arora : ఎవరీ ఇషా అరోరా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యూపీ పోల్ ఆఫీసర్.!

యూపీలోని సహారన్ పూర్ పోలింగ్ అధికారి ఇషా అరోరా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలింగ్ సామాగ్రితో కేంద్రానికి వచ్చిన ఇషా అరోరాను కెమెరాల్లో బంధించారు. ఇంతకీ ఎవరీ ఇషా అరోరా? అమె గురించి ఎందుకంత చర్చ జరగుతోంది? ఈ స్టోరీ చదవండి.

New Update
Polling Officer Isha Arora : ఎవరీ ఇషా అరోరా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యూపీ పోల్ ఆఫీసర్.!

Polling Officer : లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) తొలి దశలో ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని 8 స్థానాలకు పోలింగ్ జరగ్గా, రాష్ట్రంలో 57.54 శాతం ఓటింగ్ జరిగింది. ఎన్నికలకు ముందు పోలింగ్ అధికారి ఇషా అరోరా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అయ్యాయి. సహరాన్‌పూర్‌లోని బూత్‌లో పోలింగ్ అధికారి ఇషా అరోరా వెలుగులోకి వచ్చారు. తన గ్లామర్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చూడటానికి పోలింగ్ అధికారిని వలే కాకుండా.. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఫిదా చేసింది. ఇషా అరోరా గ్లామర్ చూసిన నెటిజన్లు సహరాన్ పూర్ లో ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఇషా అరోరా ఎవరు?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఉద్యోగి అయిన ఇషా అరోరా(Isha Arora) ప్రస్తుతం గంగోహ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మదారి గ్రామంలో సహరన్‌పూర్ లోక్‌సభ ఎన్నికల 2024 కోసం తన పోలింగ్ డ్యూటీ నిర్వహించారు. గర్హి గ్రామంలోని పోలింగ్ బూత్‌లో మొదటి పోలింగ్ అధికారిగా పనిచేస్తున్న ఇషా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గురించి ఇషా అరోరా స్పందించారు. తనకు అప్పగించిన పనులు సక్రమంగా నిర్వహించడం తన బాధ్యత అని..ఈ సమయంలో స్త్రీ, పురుషులందరూ సమయమనం పాటించాలన్నారు. లేదంటే ఇంత పెద్ద ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. ఇది ఎన్నికల సమయం, సమయానికి రావడం నా కర్తవ్యం కాబట్టి నేను బిజీగా ఉన్నాను.నేను నా డ్యూటీని సమయానికి నిర్వహించాను అని చెప్పుకొచ్చింది.

తన అందం గురించి:
ఇషా అరోరా మాట్లాడుతూ, 'సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు చూసుకునే సమయం లేదు. ఎన్నికల బిజీ ఉండటంతో మొబైల్ చూసుకునే సమయం కూడా దొరకలేదు. వైరల్ అవుతున్న ఫొటోలు ఇప్పుడు చూసాను. చాలా బాగున్నాయి. ఇందులో అందం గురించి ఏమీ లేదు. సమయపాలన గురించి. సమయానికి డ్యూటీకి చేరుకున్నాను. మీరు దీన్ని పని పట్ల నిబద్ధత గురించి మాత్రమే ఉంది. అంతే తప్పా మరొకటి లేదంటూ సింపుల్ గా చెప్పుకొచ్చారు.

బూత్‌కు EVMని తీసుకువెళుతున్న అధికారితో కలిసి వెళ్లిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన వెంటనే వైరల్ అయ్యాయి. ఇషా అరోర్ గురించి తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపించారు. ఆమె పోలింగ్ సామగ్రిని తీసుకుని వెళ్తున్న సమయంలో తోటి అధికారులు కూడా ఆమెతో ఫొటోలు దిగారు. ఇషా తన గ్లామరస్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంది.ఇక ప్రజాస్వామ్యం గొప్ప పండుగలో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఓటర్లందరికీ ఇషా విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి:  ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: జగన్ కు ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా జగన్ నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ముద్రగడ జగన్ కు లేఖ రాశారు. PACలో చోటు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు త్రికణశుద్ధిగా పని చేస్తానన్నారు.

New Update
Mudragada Padmanabham YS Jagan

Mudragada Padmanabham YS Jagan

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ మాజీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు త్రికరణశుద్ధిగా కష్టపడతానని లేఖలో పేర్కొన్నారు. పేదవారికి మీరే ఆక్సిజన్ అంటూ కొనియాడారు. ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పది కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment