IND vs NZ: రోహిత్‌కి ఆ విషయంలో తలనొప్పి.. వరల్డ్‌కప్‌లో మరో హై వోల్టేజ్ ఫైట్! ప్రపంచకప్‌లో మరో హై వోల్టేజ్ ఫైట్‌ని తిలకించేందుకు క్రికెట్ అభిమానులు రెడీ ఐపోయారు. ఇవాళ(అక్టోబర్ 22) భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో గాయపడ్డ పాండ్యా స్థానంలో షమి లేదా సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. By Trinath 22 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ప్రపంచకప్‌లో ఆసక్తికర సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఇవాళ(అక్టోబర్ 22) ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధించిన ఇరు జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ కాస్త ఎక్కువగా ఉండడంతో కివీస్ ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టాప్ పొజిషన్‌కు రావాలని టీమిండియా భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో తుది జట్టు ఎంపిక రోహిత్‌ను టెన్షన్ పెడుతోంది. ఆ స్థానంలో ఎవరు? బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డాడు. దీంతో కివీస్‌తో మ్యాచ్‌కు పాండ్యా అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో ఎవర్ని ఆడించాలన్నదానిపై రోహిత్ ఇప్పటివరకు ఓ క్లారటీకి రాలేదని సమాచారం. సూర్యకుమార్ యాదవ్‌ని ఆడిస్తారా లేకపోతే షమికి ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే అవకాశాలు ఉండడంతో షమిని తుది జట్టులోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇషాన్ కిషన్, అశ్విన్‌లలో ఒకర్ని తీసుకుంటారని కొంతమంది ఎక్స్‌పర్ట్స్ భావిస్తుండగా.. సూర్యకి ఛాన్స్ ఇస్తారని మరికొందరు అంటున్నారు. ముఖాముఖి పోరు: మొత్తం మ్యాచ్‌లు: 116 భారత్ విజయం సాధించిన మ్యాచ్‌లు: 58 న్యూజిలాండ్ విజయం సాధించిన మ్యాచ్‌లు: 50 ఫలితం రాని మ్యాచ్‌లు: 07 ప్లేయింగ్ ఎలెవన్(అంచనా) ఇండియా (భారత్): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్/ ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ/ శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ న్యూజిలాండ్ (న్యూజిలాండ్): డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్ Also Read: IND vs NZ: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఊహించని ట్విస్ట్.. మిడిలార్డర్‌లో ఆ స్టార్ బౌలర్! - Rtvlive.com #icc-world-cup-2023 #india-vs-newzealand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి