World cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక స్కోరు.. లంకేయులపై సఫారీల సెంచరీల సునామీ! వరల్డ్‌కప్ స్టార్ట్ అయిన మూడో రోజే కొత్త రికార్డు నమోదైంది. శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ఈ సరికొత్త రికార్డుకు వేదికైంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లని ఊచకోత కోశారు. 50 ఓవర్లలో ఏకంగా 5 వికెట్ల నష్టానికి ఏకంగా 428 రన్స్ చేశారు. వరల్డ్‌కప్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోరు. By Trinath 07 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వరల్డ్‌కప్ స్టార్ట్ అయిన మూడో రోజే కొత్త రికార్డు నమోదైంది. శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ఈ సరికొత్త రికార్డుకు వేదికైంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లని ఊచకోత కోశారు. 50 ఓవర్లలో ఏకంగా 5 వికెట్ల నష్టానికి ఏకంగా 428 రన్స్ చేశారు. వరల్డ్‌కప్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోరు. వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్లు: ① 428/5 - దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక, ఢిల్లీ(ఇవాళ్టి మ్యాచ్) ② 417/6 - ఆస్ట్రేలియా వర్సెస్ అఫ్ఘాన్, పెర్త్ 2015 ③ 413/5 - భారత్ వర్సెస్ బెర్మూడా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ 2007 ④ 411/4 - సౌతాఫ్రికా వర్సెస్ ఐర్లాండ్, కాన్ బెర్రా 2015 ⑤ 408/5 - దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్, సిడ్నీ 2015 Someone please get the Sri Lankan team out of the Arun Jaitely Stadium. This is demolition job of highest class. 419-5 with an over to go 😲😲😲#SAvsSL #SLvSA #icccricketworldcup2023 pic.twitter.com/qQAVLO1ulW — Zubair Shakeel Wani (@ZubiTalks) October 7, 2023 అటు ప్రపంచ కప్ హిస్టరీలో అత్యధిక సార్లు 400కు పైగా రన్స్ చేసిన జట్టుగా ఇండియా నిలిచింది. భారత్ జట్టు 6సార్లు ఈ ఫీట్ సాధించింది. ఇంగ్లాండ్ ఐదుసార్లు, ఆస్ట్రేలియా, శ్రీలంక రెండుసార్ల సాధించాయి. ఇక వన్డేల్లో శ్రీలంకపై ఇదే అత్యధిక జట్టు స్కోరు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ మతీషా పతిరానా 95 పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా మూడు సెంచరీలు: ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు వీరవీహారం చేశారు. ఓపెనర్ డికాక్‌తో మొదలైన పరుగుల సునామీ చివరిలో మిల్లర్ రెచ్చిపోయే వరకు కొనసాగింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ముగ్గురు సెంచరీలు చేశారు. డికాక్, వాన్ డర్ డస్సన్‌తో పాటు మార్క్‌రమ్ సెంచరీలు చేశారు. ముఖ్యంగా మార్క్‌రమ్ కొత్త రికార్డు సృష్టించాడు. 54 బంతుల్లో 106 రన్స్ చేశాడు. 49 బంతుల్లోనే సెంచరీ చేసిన మార్క్‌రమ్ వరల్డ్‌కప్ హిస్టరీలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. మార్క్‌రమ్ ఏకంగా 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అటు డికాక్ 84 బాల్స్‌లో 100 రన్స్ చేశాడు. డికాక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక వాన్ డర్ డస్సన్ సైతం రెచ్చిపోయి ఆడాడు. 110 బంతుల్లో 108 రన్స్ చేశాడు డస్సన్. ఇక చివరిలో క్లాసెన్, మిల్లర్ ఫాస్ట్‌గా రన్స్ చేయడంతో సౌతాఫ్రికా రికార్డు స్కోరు సాధించింది. 20 బంతుల్లో క్లాసెన్ 32 రన్స్ చేయగా.. మిల్లర్ 21 బంతుల్లో 39 రన్స్ చేశాడు. ALSO READ: కంగారులకు మూడినట్టే.. ఇక కాస్కో స్మిత్.. మా వాడితో మాములుగా ఉండదు మరి! CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL #icc-world-cup-2023 #south-africa-vs-srilanka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి