NED vs PAK: పసికూనలపై పాక్ ప్రతాపం.. కాస్త అటూ.. ఇటూ అయ్యింటేనా? వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో గెలిచింది. పసికూన నెదర్లాండ్స్‌ని చిత్తు చేసింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టార్గెట్‌ని ఛేజ్ చేయలేకపోయింది. హసన్ అలీ, హారీశ్ రౌఫ్‌తో పాటు మిగిలిన బౌలర్లు చెలరేగిపోవడంతో నెదర్లాండ్స్ విలవిలలాడింది. By Trinath 06 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో గెలిచింది. పసికూన నెదర్లాండ్స్‌ని చిత్తు చేసింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టార్గెట్‌ని ఛేజ్ చేయలేకపోయింది. హసన్ అలీ, హారీశ్ రౌఫ్‌తో పాటు మిగిలిన బౌలర్లు చెలరేగిపోవడంతో నెదర్లాండ్స్ విలవిలలాడింది. అయితే పాక్ గెలుపును పెద్ద విజయంగా భావించడంలేదు క్రికెట్ లవర్స్. ఎందుకంటే నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టుపై పాక్ పూర్తిస్థాయిలో ఆధిపత్యం చెలాయించలేకపోయింది. నెదర్లాండ్స్‌పై పాక్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. తడపడ్డారు..నిలపడ్డారు: మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 రన్స్‌కి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు జమాన్, ఇమామ్ పూర్తిగా నిరాశపరిచాఉ. ఇక వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ బాబర్ అజామ్ 18 బంతులు ఆడి కేవలం 5 పరుగులే చేశాడు. దీంతో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. ఇదే సమయంలో క్రీజులోకి వచ్చిన రిజ్వాన్‌తో పాటు షకీల్ జట్టును ఆదుకున్నాడు. ఓవైపు రిజ్వాన్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు సాధిస్తే మరోవైపు షకీల్ దూకుడుగా ఆడాడు. 75 బంతుల్లో 68 రన్స్ చేసిన రిజ్వాన్ లీడే బౌలింగ్‌లో అవుట్ అవ్వగా.. 52 బంతుల్లోనే షకీల్ 68 రన్స్ బాదాడు. ఈ ఇద్దరు అవుట్ తర్వాత ఇఫ్తీకార్ కేవలం 9 రన్స్ చేసి అవుట్ అవ్వగా.. నవాజ్‌తో పాటు షాదబ్ జట్టును నిలబెట్టారు. నవాజ్ 43 బంతుల్లో 39 రన్స్ చేస్తే.. షాదాబ్ 34 బంతుల్లో 32 రన్స్ చేశాడు. ఇక లీడే బౌలింగ్ ఈ మ్యాచ్‌లో అదిరింది. 6.9ఎకానమీతో బౌలింగ్ చేసినా 4వికెట్లు పడగొట్టాడు.. స్పష్టంగా కనిపించిన అనుభవంలేమి: టార్గెట్ రీచ్‌లో నెదర్లాండ్స్ తడపడుతూ లేస్తూ ఆడింది. ఓపెనర్ విక్రమ్ జిత్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 67 బంతుల్లో 52 రన్స్ చేవాడు విక్రమ్ జిత్ సింగ్. మరో ఓపెనర్ మాత్రం కేవలం 5 పరుగులకే అవుట్ అయ్యాడు. వన్ డౌన్‌లో వచ్చిన అఖర్‌మ్యాన్ సైతం నిరాశపరిచాడు. ఇదే సమయంలో క్రేజులోకి వచ్చిన లీడే బౌలింగ్‌లో అదరగొట్టినట్టే బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. 68 బంతుల్లో 67 రన్స్ చేసిన లీడేని చివరకు నవాజ్ అవుట్ చేశాడు. ఓ దశలో గెలుపు వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపించిన నెదర్లాండ్స్‌ను అనుభవంలేమి స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా లోయర్ మిడిలార్డర్ తేలిపోయింది. చివరిలో వ్యాన్ బీక్ 28 బంతుల్లో 28 రన్స్ చేసి గెలుపు గేప్‌ని కాస్త తగ్గించాడు. ALSO READ: అహ్మదాబాద్ లో జరిగే భారత్- పాక్ మ్యాచ్ కోసం.. వందే భారత్ రైళ్లు..! CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL #icc-world-cup-2023 #netherlands-vs-pakistan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి