World Cup: అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగి.. ప్రపంచాన్ని జయించి..! తలరాతను మార్చిన వీరులు వీరే!

1983లో భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ గెలుచుకుంది. కపీల్‌దేవ్‌ కెప్టెన్సీలో దిగ్గజ వెస్టిండీస్‌ జట్టును మట్టికరిపించి విశ్వవిజేతగా ఆవర్భవించింది. ఇండియా గెలవడంతో ఆల్‌రౌండర్‌ మొహిందర్‌ అమర్‌నాథ్‌ కీలక పాత్ర పోషించాడు. టోర్నీ మొత్తం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థులపై ప్రతాపం చూపాడు.

New Update
World Cup: అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగి.. ప్రపంచాన్ని జయించి..! తలరాతను మార్చిన వీరులు వీరే!

1983 World Cup: ఇప్పుడంటే క్రికెటర్లకు సకాల సదుపాయాలు, అత్యాధునిక వసతులు, స్పెషల్‌ ట్రైనింగ్‌, వరల్డ్‌ క్లాస్‌ కోచింగ్‌, టాప్‌ స్పాన్సర్లు, వేల కోట్ల బిజినేస్.. కానీ 1983కి ముందు ఇవేవీ లేవు.. టీమిండియా ఒక పసికూన జట్టు. ఎలాంటి అంచనాలు లేని జట్టు.. 1983 వరల్డ్‌కప్‌లో భారత్‌ అండర్‌డాగ్స్‌గానే బరిలోకి దిగింది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన మూడో వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ జట్టు ఒక్క మ్యాచైనా గెలుస్తుందా అని అంతా అనుకున్నారు. గవాస్కర్‌(Gavaskar), కపిల్‌ దేవ్‌(Kapil dev) లాంటి స్టార్లు ఉన్నా.. జట్టుగా రాణించలేదని అంచనాలు వేశారు. కానీ టోర్ని మొదలైన తర్వాత టీమిండియా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టోర్నీలో సత్తా చాటింది. ఫైనల్‌లో అప్పటికీ రెండు సార్లు వరల్డ్‌కప్‌ ఛాంపియన్‌ అయిన వెస్టిండీస్‌ను ఓడించింది. విశ్వవిజేతగా ఆవర్భవించింది.

సమిష్టి కృషి:
ఫైనల్‌లో వెస్టిండీస్‌ని మట్టికరిపించడం భారత్‌ క్రికెట్‌ దశా, దిశను మార్చేసింది. భారత్‌ క్రికెట్‌ తలరాతను మార్చిన విజయం ఇది. ఈ విజయం తర్వాత క్రికెట్‌కు దేశంలో కొత్త ఊపు వచ్చింది. 1983 వరల్డ్‌కప్‌లో భారత్‌ జట్టు 8 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అప్పట్లో వన్డే మ్యాచ్‌లు 60 ఓవర్లకు జరిగేవి. లార్డ్స్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇండియా 54.4 ఓవర్లలో 183 రన్స్‌కి ఆలౌట్ అయ్యింది. జట్టులో కృష్ణమాచారి శ్రీకాంత్‌ టాప్‌ స్కోరర్‌. 57 బంతుల్లో 38 రన్స్ చేశాడు చీకా. అందులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ కూడా ఉంది.

publive-image 1983 వరల్డ్ కప్ టీమ్

లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ ఏ దశలోనూ విజయంవైపు అడుగులు వెయ్యలేదు.. 1975, 1979లో వెస్టిండీస్‌ తొలి రెండు వన్డే ప్రపంచకప్‌లను గెలుచుకుంది. వివియన్‌ రిచర్డ్స్‌ లాంటి దిగ్గజ ప్లేయర్లున్న వెస్టిండీస్‌ టీమ్‌ 184 పరుగులు చేయలేక చతకిలపడింది. మదన్‌ లాల్‌, అమర్‌నాథ్‌ బంతితో మరిశారు. ఇద్దరూ తలో మూడు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించారు. దీంతో ఇంగ్లండ్‌ గడ్డపై వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది.

మొహిందర్‌ అమర్‌నాథ్‌ ది రియల్‌ హీరో:
1983 ప్రపంచకప్‌ అనగానే అందరూ కపిల్‌దేవ్‌ గురించి చెప్పుకుంటారు.. కొన్నాళ్లు పోతే 2011 ప్రపంచకప్‌ అనగానే అంతా ధోనీ గురించి చెప్పుకోవచ్చు.. వీరద్దరూ జట్టును సమర్థవంతంగా నడిపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కెప్టెన్‌గా వీరు సక్సెస్‌ వెనుక.. ఈ రెండు ప్రపంచకప్‌లు రావడానికి నాడు మొహిందర్‌ అమర్‌నాథ్‌ కారణం అయితే 2011లో యువరాజ్‌ సింగ్‌ కారణం. అందుకే వీరికే ప్లేయార్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డులు దక్కాయి. ఆల్‌రౌండర్‌గా 2011 ప్రపంచకప్‌లో యువీ ఎలా జట్టును గెలిపించాడో నేటి తరం పిల్లలకు తెలిసే ఉండొచ్చు.. కానీ మొహిందర్‌ అమర్‌నాథ్‌ గురించి కొద్దీ మందికే తెలుసు. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ గెలుపుకే కాదు.. గ్రూప్‌ మ్యాచ్‌ల్లోనూ అతని కారణంగా ఇండియా విజయాలు సాధించింది. నాటి సెమీస్‌లో అమర్‌నాథ్‌ ఇంగ్లండ్‌ని టోర్ని నుంచి సాగనంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసిన ఈ వీరుడు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో 46 పరుగులు చేశాడు. ఇలా టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడంలోనూ, ఫైనల్‌లో గెలవడంలోనూ అతను కీలక పాత్ర పోషించాడు. అందుకే మొహిందర్‌ అమర్‌నాథ్‌ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.. అదే సమయంలో ఎక్కువగా గుర్తింపు దక్కలేదన్న బాధా కలుగుతుంది.


Also Read: నాడు మ్యాచ్‌ ఫీజ్‌ రూ.1,500.. ఇప్పుడెన్ని లక్షలో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు