AUS vs NZ: మ్యాచ్‌ అంటే ఇది.. నరాలు తెగిపోయాయి భయ్యా..! అయ్యో బ్లాక్‌ క్యాప్స్..

మరో హై థ్రిల్లర్‌ మ్యాచ్‌కు ధర్మశాల వేదికైంది. లాస్ట్ బాల్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరకు ఆస్ట్రేలియా గెలిచింది. 389 పరుగులు లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ చివరి బంతికి బోల్తా పడింది. 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు చేసిన కివీస్‌ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ హెడ్‌, కివీస్‌ బ్యాటర్‌ రచిన్‌ సెంచరీలు చేశారు.

New Update
AUS vs NZ: మ్యాచ్‌ అంటే ఇది.. నరాలు తెగిపోయాయి భయ్యా..! అయ్యో బ్లాక్‌ క్యాప్స్..

వన్డే క్రికెట్‌లో అసలుసిసలైన మజాను ఎక్స్‌పిరియన్స్‌ చేశారు అభిమానులు. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం ఆస్ట్రేలియా(Australia)నే వరించింది. న్యూజిలాండ్‌(NewZealand) ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ విజయం ఆసీస్‌కు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కివీస్‌, ఆసీస్‌కు పాయింట్లు సమానంగానే ఉన్నా న్యూజిలాండ్‌ నెట్‌రన్‌రేట్‌ ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా ఉంది.


ఊపేసిన హెడ్‌, కమ్మిన్స్‌:
ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు వార్నర్‌, హెడ్‌ చెలరేగి బ్యాటింగ్ చేశారు. పోటీ పడి బౌండరీలు బాదడంతో ఆస్ట్రేలియా స్కోరు బోర్డు ఉరుకులు పెట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరు హాఫ్‌సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సెంచరీ వైపు పరుగులు పెడుతున్న వార్నర్‌ 81 పరుగుల వద్ద అవుట్ అవ్వగా.. హెడ్‌ హండ్రెడ్‌ పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో 107 పరుగులు చేసిన హెడ్‌ గ్లెన్‌ ఫిలప్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కాస్త స్లోగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులకు బ్రేకులు పడ్డాయి. ఇక లాస్ట్ మ్యాచ్‌ హీరో మ్యాక్స్‌వెల్ ఎంట్రీతో మరోసారి ఆసీస్‌ స్కోరు వేగంగా పరిగెత్తింది. 24 బాల్స్‌లో 41 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ అవుటైన తర్వాత కెప్టెన్ కమ్మిన్స్‌ న్యూజిలాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టీ20 లెవల్‌లో బ్యాటింగ్ చేస్తూ రఫ్పాడించాడు. కేవలం 14 బంతుల్లో కమ్మిన్స్‌ 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బ్యాటర్లంతా ఆశించిన స్థాయిలో ఆడడంతో ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది.


రచిన్.. అదరహో:
389 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మెరుపు స్టార్ట్ ఇచ్చారు. అయితే హెజిలవ్‌వుడ్ ఇద్దరిని అవుట్ చేసి కివీస్‌కు దెబ్బకొట్టాడు. 17 బంతుల్లో 28 పరుగులు చేసి కాన్వే అవుట్ అవ్వగా.. వీల్‌ యంగ్‌ 37 బాల్స్‌లో 32 రన్స్ చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక ఆ తర్వాత కివీస్‌ సంచలన ప్లేయర్‌ రచిన్‌ రవీంద్ర ఆట, వేట మొదలైంది. ఈ వరల్డ్‌కప్‌లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న రచిన్‌ మరోసారి అదరగొట్టాడు.. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పరిస్థితికి తగ్గట్లుగా రెచ్చిపోయి ఆడిన రచిన్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 89 బంతుల్లో 116 రన్స్ చేసిన రచిన్‌ చివరకు కమ్మిన్స్‌ బౌలింగ్‌లో లబూషెన్‌ క్యాచ్‌తో అవుట్ అయ్యాడు. డెరిన్ మిచెల్‌ కూడా అర్థంసెంచరీతో రాణించాడు. అయితే లాథమ్‌ ఫెయిల్ అవ్వడంతో కివీస్‌ ఓటమి ఫిక్స్‌ అని అంతా భావించారు. ఈ సమయంలోనే జేమ్స్‌ నిషమ్‌ తన టాలెంట్‌ ఏంటో ప్రపంచానికి మరోసారి చూపించాడు. చివరి వరకు మ్యాచ్‌ను తీసుకొచ్చాడు. చివరి రెండు బంతులకు 7 పరుగులు చేయాల్సిన సమయంలో రెండో పరుగులకు యత్నించి నిషమ్‌ అవుట్ అయ్యాడు. ఇక తర్వాత దిగిన లాకీ ఫెర్గుసన్‌ సిక్సర్‌ కొట్టకపోవడంతో ఆస్ట్రేలియా గెలిచింది.

Also Read: ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు రెడీ అయిన మ్యాచ్‌ విన్నర్… పాపం బట్లర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు