AUS vs NZ: ఆస్ట్రేలియా గెలవడానికి అసలు కారణం ఇదే.. ఎవరైనా అడిగితే ఈ ప్రూఫ్స్‌ చూపించండి!

ఆస్ట్రేలియా ఫీల్డర్ల పోరాటమే ఆ జట్టును గెలిపించింది. చివరి ఓవర్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌తో జట్టుకు నాలుగు పరుగులు సేవ్ చేశారు మ్యాక్స్ వెల్‌, లబూషెన్‌. కివీస్‌ కేవలం గెలుపునకు 5 పరుగుల దూరంలోనే నిలిచింది. ఒకవేళ ఆస్ట్రేలియా ఫీల్డర్ల విన్యాసాలే లేకుంటే మ్యాచ్‌ రిజల్ట్‌ మరోలా ఉండేది.

New Update
AUS vs NZ: ఆస్ట్రేలియా గెలవడానికి అసలు కారణం ఇదే.. ఎవరైనా అడిగితే ఈ ప్రూఫ్స్‌ చూపించండి!

బ్యాటింగ్‌, బౌలింగ్‌ను మాత్రమే నమ్ముకుంటే గెలిచే రోజులు కావివి. క్రికెట్ రూపురేఖలు మారిపోయి ఏళ్లు గడిచిపోయాయి. మ్యాచ్‌ గెలవాలంటే ఒకప్పుడు సెంచరీలు, వికెట్లు తియ్యడం కావాలి.. ఇప్పుడు ఈ రెండే ఉంటే సరిపోదు. గెలిచే మ్యాచ్‌లను తారుమారు చేసే సత్తా ఫీల్డింగ్‌కు ఉంది. అన్ని జట్లకు ఈ విషయం తెలుసు. ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాల పాటు ఏలిన ఆస్ట్రేలియాకు అందరికంటే కాస్త ఎక్కువే తెలుసు. అందుకే ఫీల్డింగ్‌ను అసలు విస్మరించదు ఆసీస్‌. అది వారి బలం కూడా. మరోసారి అదే ప్రూవ్‌ అయ్యింది. వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఖాతాలో మరో రెండు పాయింట్లు యాడ్‌ అయ్యాయి. దీనికి కారణం ఆ జట్టు ఫీల్డింగ్‌.


టెన్షన్ టెన్షన్..!
క్రికెట్‌లో చేసే ప్రతి పరుగు ముఖ్యమే. చాలా సార్లు కేవలం ఒక్కపరుగు మ్యాచ్‌ ఫలితాన్నే మారుస్తుంది. అదే సమయంలో ఫీల్డర్లు సేవ్‌ చేసే ప్రతీ పరుగు విలువకట్టలేనిది. ఇది చాలా మంది గుర్తించరు కానీ.. ఫీల్డింగ్‌ మేక్స్‌ టీమ్‌ విన్ అన్నది అక్షర సత్యం. ఇది నిజమని ఆసీస్‌ వర్సెస్ న్యూజిలాండ్‌ మ్యాచ్‌ చూసిన ఎవరైనా చెబుతారు. చివరి ఓవర్‌లో న్యూజిలాండ్‌ 19 పరుగులు చేయాల్సి ఉంది. సర్కిల్ బయట ఐదు ఫిల్డర్లు కాకుండా నలుగురు ఫిల్డర్లకే అనుమతి ఉంది. ఎందుకంటే ఓవర్లు ఓవర్‌ టైమ్‌ దాటిపోయాయి. దీంతో పెనాల్టి కింది నలుగురు ఫిల్డర్లే ఉన్నారు.


ఆ నాలుగు పరుగులే గెలిపించాయి:
క్రీజులో జెమ్స్ నిషమ్‌ పాతుకుపోయి ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై అప్పటివరకు ఎదురు దాడి చేశాడు. అతని పోరాటానికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. మిచెల్ స్టార్క్ ఓ భారీ వైడ్‌ వేశాడు.. అది కాస్త కీపర్‌ను బీట్ చేస్తూ బౌండరీ రోప్‌ను టచ్‌ అయ్యింది. దీంతో బంత కౌంట్ అవ్వకుండానే కివీస్‌ ఖాతాలో 5 పరుగులు యాడ్ అయ్యాయి. దీంతో న్యూజిలాండ్‌ గెలుస్తుందని అంతా భావించారు. నిషమ్ కొట్టిన ఓ బంతి బౌండరీ రోప్‌ వరకు వెళ్లింది. కానీ ఎక్కడ నుంచి వచ్చాడో కానీ మ్యాక్స్‌వెల్ బాల్‌ని డైవ్‌ చేస్తూ ఆపాడు. దీంతో రెండు పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కివీస్‌. తర్వాత నిషమ్‌ కొట్టిన బంతి కూడా అల్‌మోస్ట్ ఫోర్‌ వెళ్లిన్నట్టే కనిపించింది. కానీ లబూషెన్‌ అదిరిపోయే డైవ్‌తో రెండు రన్స్ సేవ్ చేశాడు. ఈ రెండు జరగకపోయి ఉంటే మ్యాచ్‌ రిజల్ట్ మరోలా ఉండేది. జట్టు స్కోరులో నాలుగు పరుగులు యాడ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఓడిపోయింది కేవలం 5 రన్స్‌తోనే. అంటే ఆస్ట్రేలియా గెలుపునకు, న్యూజిలాండ్‌ ఓటమికి కారణం ఫీల్డింగే..!

Also Read: మ్యాచ్‌ అంటే ఇది.. నరాలు తెగిపోయాయి భయ్యా..! అయ్యో బ్లాక్‌ క్యాప్స్..

Advertisment
Advertisment
తాజా కథనాలు