World cup 2023: ఒక్క బంతికి 13 పరుగులు .. వన్డే ప్రపంచకప్‌లో అద్భుతం..! న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సాంట్నర్ అరుదైన ఫీట్ సాధించాడు. వన్ లీగల్ బాల్‌కి 13 రన్స్ చేశాడు. నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు క్రియేట్ అయ్యింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి లీడే బాల్ వేయగా.. అది కాస్త నో బాల్‌గా ప్రకటించాడు అంపైర్. ఆ బాల్‌ని స్టాండ్స్‌లోకి పంపించిన సాంట్నర్.. తర్వాత ఫ్రీ హిట్ బాల్‌ని కూడా సిక్స్‌గా మలిచాడు. By Trinath 10 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి 2023 వన్డే ప్రపంచ కప్(World cup) అనేక రికార్డులకు వేదిక అవుతుంది. ఇప్పటికే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగుల రికార్డు బ్రేక్ అవ్వగా..తాజాగా మరో రికార్డు క్రియేట్ అయ్యింది. ఒక్క లీగల్ డెలవరీకి 13 పరుగులు చేసింది న్యూజిలాండ్(new zealand). నెదర్లాండ్స్(netherlands)తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ ఈ రికార్డును క్రియేట్ చేసింది. బాస్ డీ లీడే వెసిన బంతికి న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ సాంట్నర్(Mitchell santner) ఈ ఫీట్ సాధించాడు. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్‌లో చివరి బంతికి ఈ రికార్డు క్రియేట్ చేశాడు సాంట్నర్. pic.twitter.com/9wOkcWGkoD — Cricket Videos Only (@cricketvideos23) October 9, 2023 ఎలా జరిగిందంటే? 49.5 ఓవర్లు అప్పటికీ ముగియగా.. చివరి బంతిని డీ లీడే(leede) వేశాడు. అది నో బాల్. అది బంతిని సాంట్నర్ స్టాండ్స్‌లోకి పంపాడు. నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ వచ్చింది. ఆ బాల్‌ని కూడా లాంగ్ ఆన్ మీదుగా సాంట్నర్ సిక్స్ కొట్టాడు. దీంతో ఒక లీగల్ బాల్‌కి 13 రన్స్ వచ్చిన్నట్టు అయ్యింది. ఈ రెండు బాల్స్ ఫుల్‌టాస్‌లు కావడం సాంట్నర్‌కి కలిసి వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బాల్స్‌లో 36 రన్స్ చేశాడు సాంట్నర్. న్యూజిలాండ్ 50ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 రన్స్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. కాన్వే 40 బంతుల్లో 32 రన్స్ చేయగా.. మరో ఓపెనర్ విల్ యంగ్ 80 బాల్స్‌లో 70 రన్స్ చేశాడు. ఇక టాక్ ఆఫ్ ది వరల్డ్ కప్ రచీన్ రవీంద్ర 51 బాల్స్‌లో 51 రన్స్ చేశాడు. ఇక మిచాల్ 47 బాల్స్‌లో 48.. ల్యాథమ్ 46 బాల్స్‌లో 53 పరుగులు చేసి అదరగొట్టాడు. స్పష్టంగా కనిపించిన అనుభవంలేమి: లక్ష్యచేధనలో నెదర్లాండ్స్ తడపడింది. ఓపెనర్లు విక్రమ్ సింగ్, మ్యాక్స్ నిరాశపరిచారు. కోలిన్ అకర్‌మెన్ 73 బాల్స్‌లో 69 రన్స్‌తో అద్భుతంగా రాణించాడు. ఇందులో ఐదు ఫోర్లు ఉన్నాయి. ఇక గత మ్యాచ్ హీరో లీడే 18 రన్స్ చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఆ తర్వాత స్కాట్ ఎడ్‌వార్డ్స్, సైబ్రాండ్ ఫర్వాలేదనిపించినా జట్టును గెలిపించలేకపోయారు. 46.3 ఓవర్లలో నెదర్లాండ్స్ 223 రన్స్‌కి ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన సాంట్నర్ 5వికెట్లతో సత్తా చాటాడు. అటు మ్యాట్ హెన్రీ 3 వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఇక రచీన్ రవీంద్ర ఒక వికెట్ తీశాడు. ALSO READ: ఈ టీమిండియా మొనగాడు వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..! #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి