IND vs NZ: 20ఏళ్ల నిరీక్షణకు తెర..అసలుసిసలైన టాపు, తోపు టీమిండియానే.. ! వరల్డ్‌కప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ని మట్టికరిపించింది. 274 టార్గెట్‌ని భారత్ 48 ఓవర్లలో ఛేజ్ చేసింది. కోహ్లీ 104 బంతుల్లో 95 రన్స్ చేశాడు. By Trinath 22 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి న్యూజిలాండ్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. బలంలో రెండు సమానమైన జట్ల మధ్య జరిగిన పోరులో భారత్‌నే విజయం వరించింది. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ ర్యాంక్‌లో దూసుకుపోయింది. ఇప్పటివరకు ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న కివీస్ రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడగా.. అన్నిటిలోనూ గెలిచింది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన సెమీస్ బెర్త్‌ని దాదాపుగా కన్ఫ్‌ఫామ్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ 95 రన్స్ చేసి 5 పరుగులతో సెంచరీ మిస్ అయ్యాడు. he is getting into pre 2018 mindset. Rohit and Kohli are not just "in form". https://t.co/kqJoGEDIvf pic.twitter.com/VfIU77NfEY — ਅੰਕਿਤ🏏∆ (@CaughtAtGully) October 22, 2023 రోహిత్ మాస్.. కోహ్లీ క్లాస్ 274 పరుగులు లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు భారత్ ఓపెనర్లు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. రోహిత్ తన ఫామ్‌ని కొనసాగిస్తూ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లతో కివీస్‌కు చుక్కలు చూపించాడు. అయితే హాఫ్ సెంచరీవైపు సాగుతున్న రోహిత్ శర్మను లాకీ ఫెర్గుసెన్ వికెట్ల ముందు లాక్ చేశాడు. రోహిత్ బౌల్డ్ అయ్యాడు. 40 బంతుల్లో 46 రన్స్ చేశాడు రోహిత్ శర్మ. అందులో ఏకంగా నాలుగు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో గిల్ కూడ మంచి క్లాస్ కనబరిచాడు. 31 బంతుల్లో 26 పరుగులు చేసిన గిల్.. లాకీ ఫెర్గుసన్‌కు అవుట్ అయ్యాడు. తర్వాత అయ్యర్, కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా కోహ్లీ తన ఫామ్ ని కంటిన్యూ చేస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో అయ్యర్ 29 బాల్స్ లో 33 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రాహుల్ కోహ్లీకి సపోర్ట్ గా నిలిచాడు. 35 బంతుల్లో 27 రన్స్ చేసిన రాహుల్ సాంట్నర్ కి అవుట్ అయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఇలా వచ్చి అలా అవుట్ అయ్యాడు. కోహ్లీలో సమన్వయ లోపం వల్ల సూర్యకుమార్ రన్ అవుట్ కావాల్సి వచ్చింది. వరల్డ్‌కప్‌లో ఇది అతనికి తొలి మ్యాచ్. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదింది ఈ జంట. కోహ్లీ సెంచరీ చేస్తాడని అంతా భావించారు. 5 పరుగులు చేస్తే కోహ్లీ సెంచరీతో పాటు ఇండియా గెలుస్తుంది. ఈ సమయంలో కోహ్లీ అవుట్ అయ్యాడు. ఇక తర్వాత దిగిన షమి, జడేజాతో కలిసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది Also Read: షమీ అదుర్స్.. సెంచరీ బాదిన కివీస్ మొనగాడు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే? #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి