World cup 2023: అదోక పీడ కల.. తలచుకుంటేనే ఏడుపు వస్తుంది.. ఈసారి కూడా అదే జరుగుతుందా?

వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్‌ 19న ఇండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దీంతో 90s కిడ్స్‌ 2007 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై ఇండియా ఓడిపోయిన మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఇండియా బంగ్లాపై గెలిచినా ఇప్పటికీ ఆ ఓటమి అభిమానులను బాధపెడుతోంది. బంగ్లాదేశ్‌, శ్రీలంకపై ఓడిపోయిన ఇండియా 2007వరల్డ్‌కప్‌లో గ్రూప్‌ స్టేజీలోనే ఇంటిముఖం పట్టింది.

New Update
World cup 2023: అదోక పీడ కల.. తలచుకుంటేనే ఏడుపు వస్తుంది.. ఈసారి కూడా అదే జరుగుతుందా?

అది 2007.. ప్రపంచకప్‌ సంవత్సరం.. టీమిండియా వరల్డ్‌కప్‌ గెలిచినట్టు.. సచిన్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ వచ్చినట్టు టీమిండియా అభిమానులు కలల కంటున్న రోజులవి. 2003 ప్రపంచకప్‌లో ఇండియా ఫైనల్‌లో ఓడిపోయింది. 2003-2007 మధ్య కాలంలో భారత్‌ జట్టులో అనేక మార్పులు జరిగాయి. గంగూలీ నుంచి ద్రవిడ్‌కి పగ్గాలు అందాయి. కోచ్‌గా గ్రేగ్‌ ఛాపెల్‌ వచ్చాడు. వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన వెస్టిండీస్‌ సిరీస్‌లో టీమిండియా అదరగొట్టింది. దీంతో ప్రపంచకప్‌కు ముందు మంచి ప్రాక్టీస్‌ లభించినట్టు అయ్యింది.

కొంపముంచిన అలసత్వం:
ఈ జోష్‌లోనే ఇండియా కరేబియన్‌ ఫ్లైట్ ఎక్కింది. ఫస్ట్‌ మ్యాచ్‌ బంగ్లాదేశ్‌(Bangladesh)తో.. అప్పుడు అది చాలా చాలా చిన్న జట్టు అది. అసలు చాలామంది మ్యాచ్‌ చూడడం కూడా అనవసరం.. ఇండియా మ్యాచ్‌ గెలిచినట్టేనని భావించారు. అయితే బ్యాటర్లు రికార్డులు కొడతారని.. సెహ్వాగ్‌, సచిన్‌ ఊచకోత కోస్తారని టీవీలు ఆన్‌ చేశారు. ముందుగా బ్యాటింగ్‌కి దిగింది ఇండియా. 300 రన్స్‌ కొట్టేస్తుందని ఫ్యాన్స్‌ ఊహించుకున్నారు. తారా గ్రౌండ్‌లో చూస్తే సీన్‌ సితార్‌.. బంగ్లాదేశ్‌ బౌలర్ మోర్తజా దెబ్బకు టీమిండియా కుప్పకూలింది. గంగూలీ, యువరాజ్‌ మినహా ఏ ఓక్క బ్యాటర్‌ కూడా రాణించలేదు. గంగూలీ కూడా బాల్స్ ఫుల్‌గా తినేశాడు. 129 బాల్స్ ఆడి కేవలం 66 రన్స్ చేశాడు. టీమిండియా కేవలం 191 పరుగలకు ఆలౌట్ అయ్యింది. మోర్తజా 9.3 ఓవర్లు వేసి కేవలం 38 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

ఈజీ ఛేజింగ్‌:
192 రన్స్ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 48.3 ఓవర్లలోనే టార్గెట్‌ని ఛేజ్ చేసింది. ఓపెనర్ తమీమ్‌ ఇక్బాల్‌ రెచ్చిపోయి ఆడడంతో టీమిండియా అసలు కోలుకోలేకపోయింది. భారత్ బౌలర్లపై అటాకింగ్‌కి దిగిన తమీన్‌ 53 బాల్స్‌లో 51 రన్స్ చేశాడు. తర్వాత షకీబ్‌ఉల్ హసన్‌, రహీమ్‌ వికెట్ పడకుండా స్లోగా బ్యాటింగ్‌ చేస్తూ టార్గెట్‌ని రీచ్‌ అయ్యారు. దీంతో అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఆ తర్వాత బెర్ముడాతో భారత్‌ రికార్డు విక్టరీ సాధించింది. గ్రూప్‌లో చివరి మ్యాచ్‌ అయినా శ్రీలంకతో భారత్‌ పరాజయం పాలవడంతో వరల్డ్‌కప్‌ నుంచి ఇంటిముఖం పట్టింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఓడిపోవడం వల్లే భారత్ ప్రపంచకప్‌ ఆశలు నాడు చెదిరిపోయాయి. ఇక అక్టోబర్‌ 19న బంగ్లాదేశ్‌తో ఇండియా తలపడనుంది. ఇప్పుడు రోహిత్ సేన మూడు విజయాలతో స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంది. ఈ సారి బంగ్లాదేశ్‌కు ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. అయినా కూడా వరల్డ్‌కప్‌లో ఎప్పుడూ ఇండియా బంగ్లాదేశ్‌పై తలపడ్డా అందరికి 2007 మ్యాచ్‌నే జ్ఞాపకం వస్తుంది.

ALSO READ: పేరుకే ఛాంపియన్‌ జట్టు.. పసికూనలంటే వణుకు.. ప్రూఫ్స్‌ ఇదిగో..!

Advertisment
Advertisment
తాజా కథనాలు