Fact Check: ఆస్ట్రేలియా టీమ్‌ సెలబ్రేషన్‌.. ఆ వీడియో ఫేక్.. అసల మేటరిదే!

వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు 'షూ'లో షాంపైన్ పోసుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఏడాది వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత సంబరాల వీడియో కాదు.. 2021 నాటిది.

New Update
Fact Check: ఆస్ట్రేలియా టీమ్‌ సెలబ్రేషన్‌.. ఆ వీడియో ఫేక్.. అసల మేటరిదే!

ICC World Cup 2023: ఫేక్‌ న్యూస్‌లు, ఫేక్‌ వీడియోలు, ఫేక్‌ ఫొటోలకు అడ్డాగా మారిపోయింది సోషల్‌మీడియా. ఏ విషయనైనా ఫేక్‌ చేసే సత్తా సో కాల్డ్‌ మన సోషల్‌మీడియా యూజర్ల దగ్గరే ఉంటుంది. వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది ఆస్ట్రేలియా గెలుపును తట్టుకోలేక వారిపై లేనిపోనివి క్రియేట్ చేస్తున్నారు. ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కాళ్లతో కూర్చున్న వివాదాస్పద ఫోటో ఆన్‌లైన్‌లో ఇప్పటికే దుమారం రేపుతోంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ తర్వాత సంబరాలు చేసుకున్న మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: ఇక తేడా వస్తే ఐదు పరుగులు సమర్పించుకోవాల్సిందే.. ఐసీసీ కొత్త రూల్ ఇదే!
ఓ వీడియోలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు షూలో డ్రింక్స్ పోసి తాగుతున్నారు. '2023 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు చేసుకుంది' అంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశాడు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు. నిజానికి ఈ వీడియో గతంలోనూ వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన ఈ వీడియో 2021 నాటిది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్ తమ తొలి టీ20 ప్రపంచకప్ విజయాన్ని షూలో తాగి సంబరాలు చేసుకున్నారు. ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లో షూట్‌ చేసిన ఈ వీడియోను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) షేర్ చేసింది.

2021లో ఆస్ట్రేలియా టీ20 వలర్డ్‌కప్‌ గెలిచిన విషయం తెలిసిందే. దుబాయ్‌ వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. ఆస్ట్రేలియాకు ఇదే తొలి టీ20 ప్రపంచకప్‌ ట్రోఫి. ట్రోఫి గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు కొంతమంది 'షూ'లో షాంపైన్ తాగారు.

Also Read: నెవర్‌ బిఫోర్‌.. పోటెత్తిన అభిమానులు.. వరల్డ్‌కప్‌లో స్టేడియం అటెండెన్స్ చూస్తే మైండ్‌ పోవాల్సిందే!

Watch:

Advertisment
Advertisment
తాజా కథనాలు