World Cup 2023: అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ఈ ప్రపంచకప్ మనదే బ్రదరూ! వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై పోరులో సెంచరీ చేశాడు కింగ్ కోహ్లీ. దీంతో ఫ్యాన్స్ బ్రెయిన్‌లో 2011 ప్రపంచకప్ గుర్తొచ్చింది. అప్పుడు కూడా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేశాడు.. ఆ ఏడాది ప్రపంచకప్ ఇండియానే గెలుచుకుంది. ఈ లాజిక్ ప్రకారం ఈ ఏడాది ప్రపంచకప్ కూడా భారత్‌నే గెలుస్తుందంటున్నారు ఫ్యాన్స్! By Trinath 20 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ప్రపంచకప్(World Cup)లో టీమిండియా చెలరేగిపోతోంది. ఇప్పటివరకు ఓటమే ఎరగని రెండు జట్లలో భారత్ ఒకటి. న్యూజిలాండ్, ఇండియా ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఏ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. ఎనిమిది పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే న్యూజిలాండ్‌కి నెట్‌రన్‌రేట్ కాస్త ఎక్కువగా ఉండడంతో నంబర్-1 స్పాట్‌లో కొనసాగుతోంది. ఈ రెండు జట్లు తర్వాత మ్యాచ్‌ల్లో అటు ఇటుగా ఆడినా సెమీస్‌కి వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది. సెమీస్‌లో ఎలా ఆడుతారన్నదానిపై ఫ్యాన్స్ ఇప్పటినుంచే లెక్కలు వేస్తుండగా.. మరోవైపు ఓ సెంటిమెంట్‌ని భారత్ క్రికెట్ టీమ్ లవర్స్ హైలెట్ చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే: 2011 ప్రపంచకప్ గుర్తింది కదా.. ఇండియా హోస్ట్ చేసిన ఆ ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సెహ్వగ్ వీరవిహారం చేశాడు. 175 రన్స్‌తో దుమ్మురేపాడు. ఇదే మ్యాచ్ ద్వారా వరల్డ్‌కప్‌లో తన ఫస్ట్ మ్యాచ్ ఆడాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కూడా సెంచరీ చేశాడు. 83 బాల్స్‌లో 100 చేసిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచాడు. సెహ్వాగ్, కోహ్లీ సెంచరీలతో టీమిండియా 50 ఓవర్లలో 370 పరుగుల భారీ స్కోరును సాధించింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినా 50 ఓవర్లలో 283 రన్స్‌తోనే సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ విజయం తర్వాత భారత్ ఈ టోర్నీలో కేవలం సౌతాఫ్రికాతోనే ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ డ్రా చేసుకుంది. క్వార్టర్స్‌లో ఆసీస్, సెమీస్‌లో పాక్‌ని ఓడించిన నాటి ధోనీ టీమ్ ఫైనల్‌లో శ్రీలంకపై విక్టరీ కొట్టి 28ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడింది. ELON MUSK has changed the LIKE BUTTON to celebrate INDIA 🇮🇳 victory 🔥 Tap 🤍 to check it .... It's working 🔥 INDIA INDIA INDIA 🇮🇳🇮🇳🇮🇳#ICCCricketWorldCup #umpire Sara Tendulkar Shreyas Chase Master #Trisha 48th ODI #ViratKohli #INDvBAN #INDvsBAN #indiavsbangladesh #KLRahul… pic.twitter.com/k3X1kI10Bi — Abdul (@RolexbhaisirSir) October 19, 2023 ఏంటా సెంటిమెంట్: ఇక నిన్నటి(అక్టోబర్ 19) మ్యాచ్ దగ్గరకు వద్దాం. పూణే వేదికగా బంగ్లాదేశ్‌పై నిన్న జరిగిన పోరులో కోహ్లీ(Kohli) సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 103 రన్స్ చేసిన నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సెంచరీని 2011 బంగ్లాపై సెంచరీతో ముడి పెట్టి ఫ్యాన్స్ ఓ లాజిక్‌ని బయటకు తీశారు. క్రికెట్‌ని మతంగా భావించే భారత్‌లో ఈ గేమ్‌ను ఫాలో అవుతూ అందులోనుంచి కొన్ని అంతుబట్టని లాజిక్‌లు, సెంటిమెంట్లు తీసి ప్రచారం చేయడం మన ఫ్యాన్స్‌కు అలవాటు. 2011 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేశాడని.. ఆ ఏడాది ప్రపంచకప్ గెలుచుకున్నామని.. ఈ ప్రపంచకప్‌లోనూ కోహ్లీ సెంచరీ చేశాడని.. అందుకే ఈ ప్రపంచకప్ ఇండియా గెలుస్తుందంటున్నారు కొంతమంది అభిమానులు. అప్పుడు నాటౌట్‌గా నిలిచినట్టే కోహ్లీ నిన్న కూడా నాటౌట్‌గా నిలిచాడని చెబుతున్నారు. మరి చూడాలి ఫ్యాన్స్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా లేకపోతే బిస్కెట్ అవుతుందా అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే! Also Read: సెంచరీతో కదం తొక్కిన కింగ్ కోహ్లీ.. బంగ్లా బొక్క బోర్లా..! #icc-world-cup-2023 #india-vs-bangladesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి