World cup 2023: పని మూడు గంటలు.. జీతం రూ.2లక్షలు.. క్రికెట్ తెలిస్తే చాలు..! క్రికెట్ అంపైర్లుకు ఇటివలీ కాలంలో జీతాలు ఎక్కువగానే పెరిగాయి. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.98 లక్షల ఫీజ్ అందుకుంటారు ఎలైట్ అంపైర్లు. ఇక ఇండియాలో అంపైర్ అవ్వాలంటే బీసీసీఐ పెట్టే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేయాలి. అభ్యర్థులు తప్పనిసరిగా మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి. By Trinath 11 Oct 2023 in జాబ్స్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. వరల్డ్ కప్(World cup) కావడంతో అందరి చూపు క్రికెట్‌వైపు మళ్లింది. చాలా మందికి చిన్నప్పుడు క్రికెటర్ కావాలన్న కల ఉంటుంది. ప్రస్తుత జనరేషన్‌లో కోహ్లీ, రోహిత్‌ని చూసి చాలా మంది క్రికెటర్ కావాలని కలలు కంటున్నారు. 90s కిడ్స్ సచిన్‌ని చూసి బ్యాట్ పట్టుకోవాలని గ్రౌండ్‌లోకి బూస్ట్ తాగి దిగేవాళ్లు. అయితే చాలామంది చిన్నతనం నుంచి టీనెజ్‌కి వచ్చేవరకు అసలు క్రికెటర్ అవ్వడానికి ప్రొసెస్ ఏంటన్నది తెలియదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. సిటీల్లో అంటే ఇప్పుడు వందల్లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. విలేజ్ వాళ్లకి మాత్రం ఈ విషయాలపై అవగాహన తక్కువ. చివరికి ఏజ్ పెరిగిపోయిన తర్వాత క్రికెటర్ కాలేకపోయాం అని బాధపడుతుంటారు. అయితే క్రికెటర్ అవ్వలేకపోయినా ఈ గేమ్‌పై పట్టు ఉంటే వేరే రకంగా మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ అదే సమయంలో డబ్బులు సంపాదించవచ్చు. File (image credit/IPL) గేమ్‌కి పెద్ద దిక్కు అతనే: క్రికెట్‌లో న్యాయనిర్ణయాలు తీసుకునేది అంపైర్(umpire) మాత్రమే. అంపైర్‌కి ఉన్న పవర్స్ ఇంకొకరికి ఉండవు. క్రికెట్‌పై అమీతమైన ఇష్టంతో పాటు గేమ్ పట్ల నాలెడ్జ్ ఉండే మీరు కూడా అంపైర్ కావొచ్చు. క్రికెటర్ అంపైర్ జీతాలు కూడా ఇటివల కాలంలో పెరిగాయి. అయితే అది లెవల్‌ని బట్టి ఉంటుంది. మన దేశం నుంచి అంపైర్‌గా మారడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. • అంపైరింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు తమ పేర్లను భారత్ క్రికెట్ బోర్డు-బీసీసీఐ(BCCI)కి ఫార్వార్డ్ చేయడానికి బాధ్యత వహించే సంబంధిత రాష్ట్ర సంఘాలతో నమోదు చేసుకోవాలి. • స్థానిక మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం పొందాలి. • బీసీసీఐ(BCCI) సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే లెవల్ 1 పరీక్ష కోసం ఈ పేర్లను పంపిస్తారు. • లెవెల్ 1 పరీక్షలో హాజరయ్యే అభ్యర్థుల కోసం బీసీసీఐ మూడు రోజుల పాటు కోచింగ్ తరగతులను ఏర్పాటు చేస్తుంది. • పరీక్షల్లో అభ్యర్థుల పనితీరు ఆధారంగా, వారిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. • షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆధారంగా మరొక పరీక్షకు హాజరు కావాలి. ఇది మౌఖిక పరీక్ష. • రెండు పరీక్షలను క్లియర్ చేసిన అభ్యర్థులు ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత నిర్వహించే లెవల్ 2 పరీక్షకు హాజరు కావాలి. • లెవల్ 2 పరీక్షలో రాత, ప్రాక్టికల్‌తో పాటు వైవా ఉంటుంది. • లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి. • లెవెల్ 2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు BCCI అంపైర్‌గా గుర్తింపు పొందిన తర్వాత ఇండక్షన్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. జీతం: మీరు ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న అంపైర్ అయితే ప్రతి ఐపీఎల్(IPL) మ్యాచ్‌కు మీకు రూ. 1.98 లక్షల ఫీజ్ చెల్లిస్తుంది బీసీసీఐ. మరోవైపు డెవలప్‌మెంట్ అంపైర్లు రెండో కేటగిరీలో ఉన్నారు. ఒక్కో మ్యాచ్‌కు 59 వేల రూపాయలు అందుకుంటారు. ఒక నివేదిక ప్రకారం, ఒక అంపైర్ సగటున 20 మ్యాచ్‌లలో అంపైరింగ్ చేస్తున్నాడు. ఫలితంగా ఐపీఎల్ సీజన్‌లో అంపైర్ దాదాపు రూ.40 లక్షలు సంపాదించవచ్చు. ALSO READ: ఈ టీమిండియా మొనగాడు వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..! #icc-world-cup-2023 #cricket-umpire-salary #cricket-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి